అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు : ప్రత్యేక రైళ్లకు రూ.1.12 కోట్లు : ఏపి ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌భుత్వం ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఖర్చుతోనే నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. పార్టీ స‌భ‌ల్లా నిర్వ‌హి స్తున్న ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ప్ర‌భుత్వ నిధులు ఖ‌ర్చు చేయ‌టం పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష‌కు నిర్ణ‌యించారు. ఆ దీక్ష ఖ‌ర్చు కోసం ప‌ది కోట్ల రూపాయాల‌ను విడుద‌ల చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఒక్క రోజు దీక్ష‌...ప‌ది కోట్లు..!

ఒక్క రోజు దీక్ష‌...ప‌ది కోట్లు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు ఢిల్లీలో ఈనెల 11వ తేదీన చేస్తున్న దీక్షకు ఏకంగా పది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అదనపు నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇంచార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర జీవో జారీ చేశారు. ఇప్పటికే ధర్మపోరాట దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఖజానా నుంచి ప్రచారం కోసం 13.77 కోట్ల రూపాయలు వ్యయం చేయడాన్ని కాగ్‌ తప్పు పట్టిం ది. అంతే కాకుండా ఈ విధంగా ప్రజాధనాన్ని రాజకీయంగా అధికార పార్టీ ప్రయోజనం కోసం వ్యయం చేయడం సు ప్రీం కోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధమని కూడా కాగ్‌ స్పష్టం చేసిన విషయం అధికారులు గుర్తు చేస్తున్నారు. అయి నా సరే ఇవేమీ లెక్క చేయకుండా ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు దీక్ష ఏర్పాట్ల కోసం ప్రాథమి కంగా పది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఏర్పాట్ల కోసం 8 కోట్లు..

ఏర్పాట్ల కోసం 8 కోట్లు..

ఈ పది కోట్ల రూపాయల్లో ఏర్పాట్ల కోసం 8 కోట్ల రూపాయలను, రవాణా సౌకర్యం కోసం రెండు కోట్ల రూపాయలుగా ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. ఈ దీక్షకు ఉద్యోగులందరూ తరలి రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం పైనా విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి. దీక్ష ఏర్పాట్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు హాజరయ్యే వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి పది కోట్ల రూపాయలు వ్యయం చేయాలని ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. వివిధ ప్రాంతాల నుంచి దీక్షకు ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దీక్షలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులను ఢిల్లీకి తరలించేందుకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేను కోరింది. దీని కోసం దక్షిణ మధ్య రైల్వేకు 1,12,16,465 రూపాయలను చెల్లించేందుకు సాధారణ పరిపాలన శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసారు. ఈ మేర‌కు రైళ్లు ఇప్ప‌టికే బ‌య‌ల్దేరాయి.

నిధుల కోసం పోరాడుతూ..ఇంత ఖ‌ర్చా..

నిధుల కోసం పోరాడుతూ..ఇంత ఖ‌ర్చా..

ఇక వైపు ఏపి ఆర్దిక క‌ష్టాలు ప‌ట్టించుకోవ‌టం లేదంటూ కేంద్రం తీరు పై పోరాటం చేస్తున్న ఏపి ప్ర‌భుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేయ‌టం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 6వ తేదీన సీఎం కార్యాలయం ఆదేశాల మేర కు సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగా అదే రోజు ఆర్థిక శాఖ పది కోట్ల రూపాయల ను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. అదే రోజు ప్రత్యేక రైళ్ల ఏర్పాటునకు నిధులను విడుదల చేస్తూ సాధారణ పరి పాలన శాఖ జీవో జారీ చేసింది. పార్టీ కార్య‌క‌ర్త‌లు..అభిమానులు త‌ర‌లి వెళ్ల‌టం కోసం ప్ర‌భుత్వ నిధులు ఖ‌ర్చు చేసేలా వ్య‌వ‌హ‌రించ‌టం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Ap Govt sanction rs 10 cr for one day Deekhsa in Delhi on 11th of this month. CM Chandra Babu decided for Deekhsa in Delhi protesting Central Govt Attitude to wards AP. Govt issued GO to spent rs 10 cr for this Deekhsa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X