అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

14 నెలల్లో జరిగిన విధ్వంసం ఏంటో చెప్పండి బాబూ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ విధ్వసం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శిస్తున్నారు. దీనిపై ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అదే రేంజ్‌లో ఫైరయ్యారు. ప్రజలు తీర్పు ఇచ్చి 14 నెలలు అయిన చంద్రబాబులో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. జగన్ పాలనలో ఏం విధ్వసం జరిగిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశానికే ఆదర్శవంతమైన పథకాలు ప్రవేశ పెట్టడం విధ్వంసమా అని సజ్జల ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అందించడం విధ్వంసమా అని నిలదీశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం విధ్వసంమా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దోచుకున్నారని విమర్శించారు.

sajjala slams tdp chief chandrababu naidu

తన హయాంలో జరిగిన విధ్వంసం జగన్ పాలనలో జరగడం లేదని చంద్రబాబు బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. యజ్ఞానికి రాక్షసులు అడ్డు పడినట్టు జగన్ చేసే మంచి పనులకు చంద్రబాబు అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉండి జూమ్ మీటింగ్‌లతో కాలం గడుపుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు.

Recommended Video

YS Jagan కుమార్తె Harsha Reddy ఘనత, Bengaluru వెళ్తున్న జగన్ దంపతులు

టీడీపీ లాంటి ప్రతిపక్షం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సజ్జల విమర్శించారు. బినామీలను రక్షించేందుకు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం కొల్పొవడంతో అమరావతిని సమస్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. అమరావతిలో ఉన్న 11 వేల మంది రైతులకు ఎలా న్యాయం చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇద్దరు రమేశ్‌ల గురించి మాత్రామే ఆలోచిస్తున్నారని ఫైరయ్యారు.

English summary
andhra pradesh government advisor sajjala ramakrishna reddy slams tdp chief chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X