అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డ‌బుల్ ఓటింగ్ కు అడ్డుక‌ట్ట...!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌..తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు స‌మాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో..దీని పై ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌రువాత ఈ నిర్ణ‌యం తీ సుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఒకే సారి పోలింగ్‌..!
తెలుగు రాష్ట్రాల్లో ద్వంద్వ ఓటింగ్‌ను అరికట్టేందుకే ఒకేవిడతలో పోలింగ్‌ నిర్వహించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ యించిన‌ట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలను 5 నుంచి 7 విడతలుగా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్షల్లో బోగస్‌ ఓట్లున్నట్లు ఈసీ దృష్టికి వచ్చింది. వేలాది మందికి తెలంగాణలోనూ, ఏపీలోనూ ఓటు హక్కు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల పోలింగ్‌ను తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా నిర్వహిస్తే.. రెండుచోట్లా ఓటేసే అవకాశముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌ నిర్వహిస్తే అవకతవకలకు తావుండదనే భావ‌న‌లో ఎన్నిక‌ల సంఘం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Same day polling in AP and Telangana : Election commission decided

జ‌గ‌న్ ఫిర్యాదుతో క‌ద‌లిక..
ఏపి - తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల కేంద్ర ఎన్నికల సం ఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసిన జ‌గ‌న్ బోగస్‌ ఓట్ల సమస్యను తెలంగాణ, ఏపీ ఎన్నికల ప్రధా నాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విష‌యం పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వీరి సంప్ర‌దింపుల త‌రువాత ఆంధ్రప్రదేశ్‌..తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు స‌మాచారం.

English summary
Election Commission decided to conduct Loksabha eelctions in AP and Telanagana on same Schedule. YCP Chief Jagan complaint to E.C for conduct polling in both states on same dates. After discussions E.c decided to implement the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X