గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాధాన్యం..
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకాచకా జరిగిపోతున్నాయి. శుక్రవారం ఉదయం 11:30కు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలవబోతున్నారు. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు, అనంతర పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్‌ను గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది.
హైకోర్టు తీర్పుతో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది.ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది. ఎల్లుండి నుంచి నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ నెల 23, తొలిదశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ, ఈ నెల 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. మార్చిలో ఆయన పదవీకాలం ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దు అని జగన్ సర్కార్ భీష్మించుకొని కూర్చొంది. కానీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది.
ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్