అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచ‌ల‌నం: టీడీపీలో చీలిక‌: న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల గుడ్ బై: ఛైర్మ‌న్‌కు లేఖ‌..!

|
Google Oneindia TeluguNews

టీడీపీలో చీల‌క వ‌చ్చింది. పార్ల‌మెంట‌రీ పార్టీ చీలిపోయింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గానే నేత‌లు పార్టీ వీడుతున్నారు.చంద్ర‌బాబుకు కుడి..ఎడ‌మ భుజాలుగా ఉన్న సుజ‌నా చౌద‌రి..సీఎం ర‌మేష్‌తో పాటుగా గ‌రిక‌పాటి మోహ‌న‌రావు..టీజీ వెంకటేష్ టీడీపీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారు రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌కు లేఖ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌..వారిని ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించ‌టం పైన అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల లాంఛ‌న‌మే.

టీడీపీకి భారీ దెబ్బ‌..పార్టీలో చీలిక‌

టీడీపీకి భారీ దెబ్బ‌..పార్టీలో చీలిక‌

ఊహించిందే జ‌రిగింది. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీని వీడ‌టం ఖాయ‌మైంది. వారు త‌మ న‌లుగురిని ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించాల‌ని కోరుతూ రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌కు లేఖ ఇచ్చారు. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న సుజ‌నా చౌద‌రి..సీఎం ర‌మేష్‌..గ‌రిక‌పాటి మోహ‌న రావు.. టీజీ వెంక‌టేష్ టీడీపీని వీడి బీజేపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు. అయితే, సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందుగా పార్టీలో చీల‌క తెస్తున్నారు. మొత్తం టీడీపీ నుండి రాజ్య‌స‌భ‌లో ఆరుగురు స‌భ్యులు ఉన్నారు. అందులో మెజార్టీ ప్ర‌కారం న‌లుగురు స‌భ్యులు టీడీపీ వీడి స‌ప‌రేటు గ్రూపుగా గుర్తించాల‌ని తొలి అడుగులో భాగంగా ఛైర్మ‌న్‌ను క‌లిసి లేఖ ఇస్తున్నారు. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు..సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌లు..వ్యూహాల మేర‌కే న‌డుచుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన స‌మాచారం.

లోక్‌స‌భ స‌భ్యులు సైతం...

లోక్‌స‌భ స‌భ్యులు సైతం...

రాజ్య‌స‌భ స‌భ్యులే కాకుండా..లోక్‌స‌భ లో టీడీపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లోక్‌స‌భ స‌భ్యుల మీద ఇప్పుడు అంద‌రి దృష్టి నెలకొని ఉంది. ఏపీలో ముగ్గురు స‌భ్యులు లోక్‌స‌భ‌కు టీడీపీ నుండి ఎన్నిక‌య్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌టం..ఓడిపోవ‌టానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగా చెబుతున్నారు. తాము ఏపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీలో ఉండ‌లేమ‌ని..అదే స‌మ‌యంలో వైసీపీలో చేర‌లేమ‌ని ఈ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో..వీరంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి ఏపీ- తెలంగాణ నేత‌ల పైన బీజేపీ అధినాక‌య‌త్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా..ఏపీలో చంద్ర‌బాబు ను రాజ‌కీయంగా ల‌క్ష్యంగా మార్చుకుంది. ఎలాగైనా చంద్ర‌బాబును ..టీడీపీని దెబ్బ తీసే వ్యూహాల‌తో ముంద‌కు వెళ్తోంది. స్వ‌యంగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా..రాం మాధ‌వ్ ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నారు.

 విదేశాల్లో చంద్ర‌బాబు...అందుబాటులోకి రాని నేత‌లు

విదేశాల్లో చంద్ర‌బాబు...అందుబాటులోకి రాని నేత‌లు

తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స‌రిగ్గా పార్టీ మార‌టానికి ఈ నేత‌లు ఇదే స‌రైన స‌మ‌యంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు ఈ నేత‌ల‌తో ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా..వీరు మాత్రం ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో వీరు బీజేపీలో చేర‌టం ఇక లాంఛ‌న‌మే. అయితే, క‌నీసం లోక్‌సభ స‌భ్యులైనా వెళ్ల‌కుండా అపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీలోని టీడీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల విష‌యంలోనూ చ‌ర్చ మొద‌లైంది. దీంతో..చంద్ర‌బాబు ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని తిరిగి ఏపీకి వ‌చ్చే అవ‌శాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

English summary
Sensational development in TDP parliamentary party. TDP Rajyasabha MP's four members ready leave party. Four members giving letter Chairman for seperate group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X