అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్ర‌భాస్ తో నాకు ఏ సంబంధమూ లేదు : ష‌ర్మిళ ఆవేద‌న : టిడిపి లో ఆందోళ‌న‌..!

|
Google Oneindia TeluguNews

ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారో.. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నా అంటూ ష‌ర్మిళ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. దీనిపి వెంట‌నే టిడిపి నుండి స్పంద‌న మొద‌లైంది. తాము జ‌గన్ ను విమ‌ర్శించాం కానీ, ష‌ర్మిళ పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌లేదంటున్నారు. అయితే, ఇత‌ర నేత‌లు మ‌రోలా స్పందిస్తున్నారు. ష‌ర్మిళ ఆవేద‌న రాజ‌కీయంగా న‌ష్టం చేస్తుంద‌నే ఆందోళ‌న టిడిపిలో క‌నిపిస్తోంది.

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు..

ప్ర‌భాస్ ను ఎప్పుడూ క‌ల‌వ‌లేదు..

ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధం ఉంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని..ఆ వ్య‌క్తికి త‌న‌కు ఏం సంబంధం లేద‌ని..ఇదే నిజ‌మ‌ని నా పిల్ల‌ల మీద ప్ర‌మాణం చేసి చెబుతున్నా అంటూ ష‌ర్మిళ మీడియా మందు ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ మాట్లాడి న తీరు ఇప్పుడు టిడిపిని ఆత్మ‌రక్ష‌ణ లో ప‌డేసింది. ఇలా దుష్ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..?. పోనీ ఆ వ్యక్తిని కలిసినట్లు గానీ, మాట్లాడినట్లుగానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా..?. పుకా ర్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవడం దారుణం కాదా..అని ష‌ర్మిళ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఏమిటీ పైశాచిక ఆనందం.. ఎందుకింత నీచానికి దిగజారటం..? ఇలా పుకార్లు చేస్తున్నవారికి.. వారి వెనకున్న వాళ్లకు సిగ్గు అనిపించలే దా? ఇంత దిగజారుడు తనం అవసరమా..? ఈ ప్రచారం వెనుక టీడీపీ హస్తముందని నేను అనుమానం లేకుండా ఆరోపణలు చేస్తున్నార‌ని ష‌ర్మిళ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

టిడిపి నేత‌లు చేస్తున్న ప‌నులే..

టిడిపి నేత‌లు చేస్తున్న ప‌నులే..

త‌న పై ఇదే ర‌క‌మైన ప్ర‌చారం 2014 ఎన్నిక‌ల ముందు కూడా చేసార‌ని షర్మిళ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 ఎ న్నికల తర్వాత ఫిర్యాదు కూడా చేసిన విషయాన్ని షర్మిళ గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని విష ప్రచా రానికి వేగం పెంచారని వివ‌రించారు. ఒక భార్యగా, తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించు కోవా ల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు, నా దేవుడికి తెలుసు. కానీ ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సి న అవసరం ఉంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెబుతున్నానని షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గతంలో జ‌గ‌న్ - ప‌వ‌న్ మ‌ధ్య జ‌రిగిన వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల్లో జ‌గ‌న్ ప‌రోక్షంగా ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. మ‌హిళ‌ల పై అభ్యంత‌ర క‌ర ప్ర‌చారం చేయ‌టం మ‌గ‌త‌న‌మా అని ప్ర‌శ్నించారు. అయితే, సోష‌ల్ మీడియా వేదిక‌గా పార్టీల అభిమానులు ఎదుటి పార్టీకి చెందిన వారి పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వెళ్ల‌టం ఈ మ‌ధ్య కాలంలో పెరిగిపోతోంది. ఇప్పుడు ష‌ర్మిళ ఫిర్యాదు ద్వా రా ఆ ర‌కంగా ప్ర‌చారం చేసిన వారి పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

 టిడిపిలో ఆందోళ‌న‌..పోలీసుల పై న‌మ్మకం లేక‌పోతే..

టిడిపిలో ఆందోళ‌న‌..పోలీసుల పై న‌మ్మకం లేక‌పోతే..

పండుగ నాడు ష‌ర్మిళ త‌న భ‌ర్తతో స‌హా వ‌చ్చి త‌న పై అభ్యంత‌ర‌కరంగా ప్ర‌చారం చేస్తున్నారంటూ హైద‌రాబాద్ సిపికి ఫిర్యాదు చేసారు. ఇది మీడియాలో విస్తృతంగా రావటం..ష‌ర్మిళ టిడిపి నేత‌లే ఈ ర‌కంగా చేస్తున్నారంటూ ఆరోపించ టంతో టిడిపి నేత‌లు ఆప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. తాము జ‌గ‌న్ ను రాజ‌కీయంగా విమ‌ర్శించాం కానీ, ష‌ర్మిళ పై ఎప్పుడూ దుష్ప్ర‌చారం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇటువంటి వాటికి చంద్ర‌బాబు పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకొచ్చారు. అయితే, హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టం పై బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ఆనంద‌సూర్య ప్ర‌శ్నించారు. ఏపి పోలీసుల పై న‌మ్మ‌కం లేక‌పోతే..ఏపి ఓట‌ర్లు ఎందుకు ఓటేయాల‌ని అడుగు తున్నారు. అయితే, వైసిపి నేత‌లు మాత్రం ఇది టిడిపి నేత‌ల ప్ర‌చారమ‌ని ఖ‌రా ఖండిగా చెబుతున్నారు. దీంతో..రాను న్న రోజుల్లో ఈ వ్య‌వ‌హారం ఎటు ట‌ర్న్ అవుతుందో చూడాలి.

English summary
Tension atmosphere was seen in the TDP camp after YS Sharmila alleged that TDP had created a ruckus on social media. TDP netas said that they had criticized Jagan on political fronts and not Sharmila by any means. TDP sees sharmila complaint a damage to the party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X