అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధానిలో దొంగలు పడ్డారు.. ఏం దోచుకెళ్ళారో తెలిస్తే షాక్ అవుతారు!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతికి దొంగల బెడద పెరిగిపోయింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు రాజధానిలో నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో అమరావతిలో నిర్మాణ సామాగ్రిని దోచుకెళ్ళే దొంగలు పెరిగిపోయారు. అర్ధరాత్రులు ఇసుక, మట్టి, కంకరు, ఐరన్ ఇలా ఏది కనబడితే అది దోచుకెళుతున్నారు. వాచ్ మెన్ లు అడ్డుకున్న లాభం లేకుండా పోతుంది. ఏకంగా లారీలను తీసుకెళ్లి లోడ్ చేసుకుని బయట అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారంటే దొంగలు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Political Gossip: ఏపీ సర్కార్ బాటలో సీఎం కేసీఆర్.. ట్రెండ్ ఫాలో కానున్న తెలంగాణా సీఎంPolitical Gossip: ఏపీ సర్కార్ బాటలో సీఎం కేసీఆర్.. ట్రెండ్ ఫాలో కానున్న తెలంగాణా సీఎం

 నిర్మాణ సామాగ్రి టార్గెట్ గా దొంగల వీరవిహారం

నిర్మాణ సామాగ్రి టార్గెట్ గా దొంగల వీరవిహారం


ఇప్పటికే పలుమార్లు రాజధాని అమరావతిలో నిర్మాణాల వద్ద కావలి ఉన్న వాచ్ మెన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగల బెడద తట్టుకోలేకపోతున్నాం మహాప్రభో అని వేడుకున్నారు. రాజధాని అమరావతిలో నిర్మా ణ సామగ్రి చోరీకి గురవుతుందని ఫిర్యాదులు చేస్తున్నా , అర్ధరాత్రులు అక్రమంగా ఇసుక, మట్టి ఇనుమును ఎత్తుకెళ్లిపోతున్న వారిని అడ్డుకుంటున్నా దొంగలు మాత్రం ఏమీ ఖాతరు చేయకుండా నిర్మాణ సామాగ్రిని దోచుకు పోతున్నారు.

 90 టన్నుల ఇనుమును దర్జాగా లారీలో తరలించిన చోరులు

90 టన్నుల ఇనుమును దర్జాగా లారీలో తరలించిన చోరులు

నెల రోజుల క్రితం మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నిల్వ ఉంచిన సుమారు రూ.45లక్షల విలు వైన 90టన్నుల ఇనుమును దొంగలు అర్ధరాత్రి లారీలకు లోడు చేసు కుని దోచుకెళ్లారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 45 లక్షల రూపాయల విలువైన ఇనుము చోరీకి గురికావడంతో ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు మంగళగిరిరూరల్‌ పోలీ సులకు ఫిర్యాదుచేశారు.

ఐరన్ చోరులను పట్టుకున్న పోలీసులు..

ఐరన్ చోరులను పట్టుకున్న పోలీసులు..

దీంతో పోలీసులు ఆ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయ వాడ ఆటోనగర్‌, గొల్లపూడి ఐరన్‌ యార్డుకు ఆ ఇనుమును తరలించి టన్ను ఇను మును రూ.20వేల చొప్పున 90 టన్నుల ఇనుమును రూ.18 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఇనుము మాత్రమే కాదు, ఇసుక, మట్టి, కంకరు ఇలా వేటినీ వదలకుండా చోరులు చోరీలకు పాల్పడుతున్నారు. దొరికినంత దోచుకో పోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ఇంతా జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిర్మాణ పనులు లేక , దొంగల బెడదతో తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్లు

నిర్మాణ పనులు లేక , దొంగల బెడదతో తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్లు


ఒకపక్క రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయినట్టే అని ప్రచారం జరిగింది. రాజధాని అమరావతి భూముల సేకరణలో కుంభకోణం జరిగిందని , అది తేలేవరకు రాజధాని నిర్మాణ పనులను ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు నిర్మాణం కోసం నిల్వ చేసుకున్న సామాగ్రి దొంగలపాలవుతుంది. ఇక డోలాయమాన స్థితిలో కాంట్రాక్టర్లు తలపట్టుకుంటున్నారు . అసలు ప్రభుత్వ విధానం అర్ధం కాక బాధపడుతుంటే ఇప్పుడు కొత్తగా దొంగల బెడద వారికి తలనొప్పిగా పరిణమిస్తుంది.

English summary
The robberies of AP capital Amravati has increased. Construction work in the capital has been stagnant since the YCP government took over in AP. This has led to an increase in robbers looting construction equipment in Amravati. At midnight, sand, mud, gravel, and iron are seen to loot. It is understandable how much the thieves are able to take the lorries and sell them outside and make money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X