అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని ప్రాంతంలో నాకు అంగుళం భూమి ఉన్నా చూపించండన్న ఎంపీ సుజనా చౌదరి

|
Google Oneindia TeluguNews

Recommended Video

సుజనా పై సంచలన ఆరోపణలు చేసిన కన్నా|| Kanna Laxminarayana Sensational Comments On Sujana Chowdary

ఏపీ పురపాలక శాఖామంత్రి బొత్స విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన బొత్సాను తనకు రాజధానిలో ఉన్న భూముల్ని చూపించాలని సవాల్ చేశారు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజధాని గ్రామాలైన తుళ్లూరు, మందడం, రాయపూడిలలో పర్యటించారు. అక్కడ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజధాని తరలింపు అంత ఈజీ కాదని తేల్చి చెప్పేశారు.

<strong>రాజధాని ముంపు ప్రాంతమని నిరూపిస్తారా... నా భూమి రాసిస్తా ..బొత్సాను సవాల్ చేసిన ఓ సాధారణ మహిళ </strong>రాజధాని ముంపు ప్రాంతమని నిరూపిస్తారా... నా భూమి రాసిస్తా ..బొత్సాను సవాల్ చేసిన ఓ సాధారణ మహిళ

 బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ ... నిరూపించామన్న సుజనా

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ ... నిరూపించామన్న సుజనా

బొత్సా సత్యన్నారాయణ బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఛాలెంజ్ చేశారు . సుజనా చౌదరిని ఉద్దేశించి ఇక్కడ ఒక్క సెంట్ కూడా భూమి లేదని అన్నారు, ఆయనకు ఇదే మా ఛాలెంజ్. మీకు ఇక్కడ భూమి ఉందొ లేదో, మీకు దమ్ముంటే మమ్మల్ని చూపమని అడగండి, మేము చూపిస్తాం. ల్యాండ్ రికార్డ్స్ కూడా చూపిస్తాం, రెడీనా అంటూ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ చేసారు. ఈ ఛాలెంజ్ పట్ల స్పందించిన సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో తనకు భూమి ఉన్నట్లు బొత్స నిరూపించాలని, ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని బొత్సాకు హితవు పలికారు.

రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదన్న సుజనా చౌదరి

రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదన్న సుజనా చౌదరి

రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదన్న సుజనా ఒకవేళ ఉంటే వైసీపీ నేతలు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు . ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బొత్సా అలా చూపించగలిగితే తాను తన ఆస్తులన్నీ ఆయన పేరు మీద రాసిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని పనులను ఆపలేదని స్వయంగా బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారని సుజనా చౌదరి పేర్కొన్నారు. కానీ రాజధాని విషయంలో చెప్పిన దానికి . జరుగుతున్న దానికి విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. రాజధాని ఘోస్ట్ క్యాపిటల్ గా తయారైందని సుజనా ఆవేదన వ్యక్తం చేశారు.

 చొక్కాలు మార్చినంత సులువు కాదు రాజధాని మార్చటం అన్న సుజనా చౌదరి

చొక్కాలు మార్చినంత సులువు కాదు రాజధాని మార్చటం అన్న సుజనా చౌదరి

వైసీపీ సర్కార్ రాజధానిని మారుస్తుందని తాను భావించడం లేదన్న సుజనా చౌదరి రాజధానిని మార్చటం చొక్కాలు మార్చినంత సులువు కాదని వ్యాఖ్యానించారు.మంత్రి హోదాలో వున్న వ్యక్తి ప్రజలను ఆందోళనలో పెట్టేటువంటి వ్యాఖ్యలు చెయ్యటం సరైన పద్ధతి కాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మంచిదేనని... అయితే అప్పటి ప్రభుత్వం రాజధానికి కావాల్సిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసిందని ఇటువంటి పరిస్థితుల్లో బొత్స వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనలోకి నెట్టాయని పేర్కొన్నారు సుజనా చౌదరి. వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన నిర్మాణాలు ఉండగా రాజధాని మార్చాలనే ఆలోచనే తప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి బొత్సా , సుజనాల సవాల్ ప్రతి సవాళ్ళతో రాజధాని తరలింపు పై జరుగుతున్న రగడ కొత్త రూపు తీసుకుంది.

English summary
The YCP leaders have challenged Sujana chowdary he does not have an inch of land in the 29 villages in the capital. He demanded that someone show up in his name, too. He said he would write down all his assets in his name if he could show it. Sujana has stated that the capital of andhrapradesh became Ghost Capital in ycp regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X