అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికార దుర్వినియోగం అడ్డుకోండి: ఆ అధికారుల పై చ‌ర్య‌లు : గ‌వ‌ర్న‌ర్ కు జ‌గ‌న్ ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను వైసిపి అధినేత జ‌గ‌న్ క‌లిసారు. ఏపిలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల పై ఫిర్యాదు చేసారు. ఏపిలో ఎన్నిక‌ల కోసం దొంగ ఓట్లు సృష్టిస్తున్నార‌ని..వైసిపి సానుభూతి ప‌రుల ఓట్లు తొలిగిస్తున్నార‌ని జ‌గ‌న్ - గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించారు. పోలీసు అధికారులు కొంద‌రు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఎన్నిక‌ల కోసం అక్ర‌మాలు..
వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఏపి ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంద‌ని విప‌క్ష నేత జ‌గ‌న్ రాజ్‌భ‌వ‌న్ లో గ‌వ ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి ఫిర్యాదు చేసారు. ఏపిలో స‌ర్వే పేరుతో ప్ర‌భు త్వంలోని వారి క‌నుసన్న‌ల్లో ఓట్ల తొలిగింపు జ‌రుగుతోంద‌ని ఫిర్యాదు చేసారు. ఏపిలో 52.67 ల‌క్ష‌ల డూప్లికేట్ ఓట్లు ఉంటే..అవి ఇప్పుడు 59.18 ల‌క్ష‌ల‌కు చేరాయ‌ని వివ‌రించారు. స‌ర్వేల పేరుతో వైసిపి సానుభూతి ప‌రులుగా గుర్తించిన వారివి 4 లక్ష‌ల ఓట్లు తొలిగించార‌ని ఆధారాల‌తో స‌హ గ‌వ‌ర్న‌ర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌భు త్వం ప్ర‌జాసాధికారిక స‌ర్వే..రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ ..ప‌రిష్కార వేదిక పేరుతో డేటా క‌లెక్ట్ చేసి ఓట‌ర్ల‌ను తొలిగిస్తున్నార ని ఫిర్యాదు చేసారు.

Take action on those Police Officers : Jagan Complaint to Governor

పోలీసు అధికారుల పైనా ఫిర్యాదు..
ఏపి ముఖ్య‌మంత్రికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్న డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంట‌లిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వేంక‌టే శ్వ‌ర‌రావు, అదే విధంగా కొత్త‌గా లా అండ్ ఆర్డ‌ర్ కో ఆర్డినేష‌న్ అధికారిగా పోస్టు సృష్టించి నియ‌మించిన ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పించాల‌ని అప్పుడే ఏపిలో ఎన్నిక‌లు స‌జావుగా జ‌రుగుతాయ‌ని జ‌గ‌న్ గ‌వ ర్న‌ర్ కు వివ‌రించారు. అదే విధంగా ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భుత్వం 37 మందికి డీఎస్పీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తే అందు లో 35 మంది ఒకే వ‌ర్గానికి చెందిన వార‌ని..వారంతా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని వివ‌రించారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేయ‌టానికి ఈ రకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ‌వ‌ర్న‌ర్‌ దృష్టికి జ‌గ‌న్ తీసుకెళ్లారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

English summary
YCP Chief Jagan met Governor and complaint on AP Govt. Jagan says Ap Govt misusing officials in votes removing of YSRCP supporters. Jagan also complaint on Police Officers who supporting TDp Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X