అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగంలోకి చంద్రబాబు: స‌ంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు: నేత‌ల‌కు ఏం చెప్పారంటే..!

|
Google Oneindia TeluguNews

టీడీపీలో సంక్షోభం ఏర్ప‌డుతున్న స‌మ‌యంలో ఆ పార్టీ అధినేత అల‌ర్ట్ అయ్యారు. కుటుంబంతో క‌లిసి విదేశాల‌కు వెళ్లిన చంద్రబాబు అక్క‌డి నుండి జ‌రుగుతున్న ప‌రిణామాల పైన ఆరా తీసారు. సుజనా చౌద‌రితో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసారు. పార్టీ సీనియ‌ర్ల‌తో చంద్ర‌బాబు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌దు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాద‌ని ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో.. బీజేపీ చ‌ర్య‌లను ఖండించారు. ఇక‌..పార్టీ నేత‌ల‌కు ఆయ‌న త‌క్ష‌ణం చేయాల్సిన కార్య‌క్ర‌మాల పైన సూచ‌న‌లు చేసారు.

అలర్ట్ అయిన చంద్ర‌బాబు...
కుటుంబ స‌భ్యుల‌తో యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబుకు పార్టీ నేత‌లు తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను వివ‌రించారు. ఢిల్లీ కేంద్రంగా జ‌రుగుతున్న పార్టీ ఫిరాయింపుల‌ను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీని పైన చంద్రాబాబు పార్టీ నేత‌ల‌కు దిశా నిర్ధేశం చేసారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాద‌ని స్ప‌ష్టం చేసారు. నేత‌లు..కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్దంటూ దైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అదే స‌మ‌యంలో బీజేపీ చేస్తున్న చ‌ర్య‌లు అనైతికం అంటూ ఫైర్ అయ్యారు. తాము బీజేపీతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాడామంటూ వివ‌రించారు. ఇక‌, ఇప్పుడు అయి దుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్తున్నార‌నే అంశం మీద ఆయ‌న పార్టీ సీనియ‌ర్ల‌తో చ‌ర్చించారు. వారు కాకుం డా రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు..ఇత‌ర నేత‌లు ఎవ‌రైనా పార్టీ మారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా అని ఆరా తీసారు. ప్ర‌ధానంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల స‌మావేశం గురించి నేత‌ల నుండి స‌మాచారం సేక‌రించారు.

TDP Chief Chandra babu reacted on MPs letter to Rajyasabha Chairman..assurance to party leaders..

ఫిరాయింపు నేత‌లతో సంప్ర‌దింపులు..
చంద్ర‌బాబు ఏపీ టీడీపీ అధ్య‌క్ష‌డు క‌ళా వెంక‌ట్రావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయ‌న నుండి స‌మాచారం సేక‌రించారు. ఆ వెంట‌నే ఢిల్లీలో ఉన్న పార్టీ నేత సుజ‌నా చౌద‌రితో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసారు. ఆయ‌న కొంత కాలంగా అసంతృప్తితో ఉండ‌టంతో ఈనెల 15వ తేదీన త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని చంద్ర‌బాబు మాట్లాడారు. త‌రువాత ఇద్ద‌రూ క‌లిసే గ‌న్న‌వ‌రం నుండి హైద‌రాబాద్‌కు ఒకే విమానంలో వెళ్లారు. ఆ స‌మ‌యంలోనే పార్టీ ఫిరాయింపుల మీద చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఇప్పుడు ఆ అయిదుగురు ఎంపీలు రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌కు త‌మ‌ను వేరుగా గుర్తించ‌మ‌ని లేఖ ఇవ్వ‌టం తో ఏం చేయాల‌నే దాని పైనా చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు సూచ‌న‌లు చేసారు. ఇప్పుడు వారి పైన స‌స్పెన్ష‌న్ చ‌ర్య‌లు తీసుకుంటే వారికి బీజేపీలో చేరేందుకు మార్గ్ సుగ‌మం అవుతుంద‌ని..వారు వేసే అడుగుల‌ను పూర్తి స్థాయిలో ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆప‌రేష‌న్ నుండి బ‌య‌ట ప‌డ‌టానికి చంద్ర‌బాబు ఎటువంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
TDP Chief Chandra babu reacted on MPs letter to Rajyasabha Chairman that appealing identify them as special group in House. TDP leaders informed party chief about latest developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X