అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడిపి మేనిఫెస్టో క‌మిటీ ఖ‌రారు..! 15మంది స‌భ్యుల జాబితా విడుద‌ల చేసిన ఏపి టీడిపి..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపీ రాకీయాలు సంకుల స‌మ‌రాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఏపీలో వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నాయి. రెండు పార్టీలో పోటాపోటీగా చేరుకలూ ఉంటున్నాయి. జగన్ హామీలకు పరిమితమయ్యే పరిస్థితి ఉంటే అధికార టీడీపీకి మాత్రం హామీతోపాటు అమలు కూడా అవకాశం ఉండటం వారికి కలిసొచ్చే అంశం.

ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రైతుల మనసు గెలిచేందుకు అన్నదాత సుఖీభవ, డ్వాక్రా అక్కచెల్లెళ్ల నచ్చేలా పసుపు కుంకుమా, పింఛన్లు రెట్టింపు వంటి ఎన్నో సంక్షమ పథకాలు తీసుకొచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో సంక్షేమంపై చంద్రబాబు దృష్టి పెట్టడం, మరోవైపు బీసీల్లో ప్రతి కులానికి కార్పోరేషన్ పెట్టే దిశగా అడుగులు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఎన్నికల ముందే ఇలా వరాలు ప్రకటిస్తున్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అని ప్రజల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

TDP Manifesto committee finalized..! Released 15 members list..!!

అలాంటి అంచనాలను చేరుకునేందుకు పార్టీలకు నిచ్చనలా ఉపయోగపడేది మాత్రం కచ్చితంగా మేనిఫెస్టోనే.! రెండు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సై అంటున్న వేళ ప్రజల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టోని తయారు చేయడం వారికి కత్తిమీద సామే.. అయితే ఇప్పటికే సంక్షేమంలో ఎన్నో మెట్లు ఎక్కిన టీడీపీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ బాధ్యతను ఇప్పుడు యనమల నేతృత్వంలోని బృందంపై చంద్రబాబు పెట్టారు. మొత్తం 15 మందితో మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు.

క‌మిటీ స‌భ్యుల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.! 1 యనమల రామకృష్ణుడు, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్. 2 కాల్వ శ్రీనివాసులు, 3 అచ్చెన్నాయుడు. 4 గంటా శ్రీనివాసరావు, 5 నక్కా ఆనందబాబు, 6 కిడారి శ్రావణ్, 7 ఎండి ఫరూఖ్, 8 డొక్కా మాణిక్య వరప్రసాద్, 9 నిమ్మల రామానాయుడు, 10 వాసుపల్లి గణేష్ కుమార్, 11 భూమా బ్రహ్మానందరెడ్డి, 12 సి కుటుంబరావు, 13 పంచుమర్తి అనురాధ, 14 S. స్వాతి రాణి, 15 P. కృష్ణయ్య.

English summary
To build the manifesto to win people's minds are on the knife. But there are many stairs in the welfare of the TDP's future plan is going to be watched with interest. But the charge is now shifted to the Yanamala-led team. The Manifesto Committee has announced a total of 15 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X