అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో రాజ్య‌స‌భ టీడీపీపీ విలీనం: క‌మ‌ల‌ద‌ళంలోకి ఆ న‌లుగురు: ఊహించ‌ని దెబ్బ‌...!

|
Google Oneindia TeluguNews

టీడీపీకి ఊహించ‌ని దెబ్బ‌. తాజా ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు స‌మ‌ర్ధ‌త‌కు దెబ్బ‌. రాజ్య‌స‌భ‌లో టీడీపీ నుండి ఆరుగురు స‌భ్యులు ఉన్నారు. వారిలో మెజార్టీ స‌భ్యులు న‌లుగురు పార్టీని రాజ్య‌స‌భ టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీని బీజేపీలో విలీనం చేయాల‌ని లేఖ ఇచ్చారు. బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాజా గా ఎన్నికైన న‌డ్డాతో క‌లిసి రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌కు లేఖ ఇచ్చారు. ఆ వెంట‌నే న‌డ్డా వారికి బీజేపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో..రాజ్య‌స‌భ‌లో మిగిలిన ఇద్ద‌రు టీడీపీ ఎంపీలు నామ మాత్రంగానే ఉండ‌నున్నారు.

TDP Rajyasabha Parliamentary party merge with BJP. Four TDP Rajyasabha members officially joined in BJP

టీడీపీకి ఊహించ‌ని దెబ్బ‌..
తెలుగుదేశంకు ఊహించ‌ని దెబ్బ త‌గ‌లింది. ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు జాతీయ స్థాయిలో సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిన చంద్ర‌బాబు..ఇప్పుడు అదే ఢిల్లీలో ఎదురు దెబ్బ తిన్నారు. రాజ్య‌స‌భ‌లో టీడీపీ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆరుగురు స‌భ్యుల్లో న‌లుగురు త‌మ రాజ్య‌స‌భ పార్ల‌మెంట‌రీ పార్టీని బీజేపీలో విలీనం చేయాల‌ని కోరుతూ సంత‌కాలు చేసిన లేఖ‌ను బీజేపీ నేత‌ల‌తో క‌లిసి వెళ్లి రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు అంద‌చేసారు. దీంతో..ఆరుగురు స‌భ్యులు ఉన్న పార్టీలో మెజార్టీ స‌భ్య‌లు నిర్ణ‌యం..షెడ్యూల్ 10 ప్ర‌కారం రాజ్యంగ బ‌ద్దంగా ప్ర‌క్రియ‌ను పూర్తి చేసారు. ఈ మేర‌కు విలీనం లేఖ పైన న‌లుగురు టీడీపీ ఎంపీలు సంతకాలు చేసారు. ఇక‌, టీడీపీ నుండి క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌.. సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే స‌భ్యులుగా ఉన్నారు. అయితే, వారిని సైతం టీడీపీ స‌భ్యులుగా పేర్కొనే అవ‌కాశం లేదు. దీంతో..ఇప్పుడు మోదీ రెండో విడ‌త అధికారంలోకి వ‌చ్చిన తొలి నెల‌లోనే టీడీపీకి భారీ దెబ్బ త‌గిలింది. దీంతో.. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని షాక్‌లు త‌గులుతాయో చూడాలి.

TDP Rajyasabha Parliamentary party merge with BJP. Four TDP Rajyasabha members officially joined in BJP

బీజేపీ కండువాలు..ఆ న‌లుగురు
టీడీపీ నుండి రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి.. సీఎం ర‌మేష్‌.. టీజీ వెంక‌టేష్‌కు బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ న‌డ్డా బీజేపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ త‌రువాత తాము ఏపీ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని న‌డ్డా స్ప‌ష్టం చేసారు. గ‌రిక‌పాటి మోహ‌న‌రావు అనారోగ్యం కార‌ణంగా హాజ‌రు కాలేదు. బీజేపీ నేత‌లు మాత్రం ఇవి ఫిరాయింపు లు కావు..విలీనం అని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. సుజ‌నా చౌద‌రి స్పందిస్తూ దేశం మొత్తం మోదీ నాయ‌క‌త్వం కోరుకుంటుంద‌ని.. ఆయ‌న నాయ‌కత్వంలో ప‌ని చేస్తూ ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవ‌టం కోస‌మే తాము బీజేపీలో చేరుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, టీజీ వెంక‌టేష్ సైతం స్పందిస్తూ ఏపీ ప్ర‌జ‌లు సైతం బీజేపీతో ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు బీజేపీతోనే ఉంద‌ని వ్యాఖ్యానించారు.

English summary
TDP Rajyasabha Parliamentary party merge with BJP. Four TDP Rajyasabha members officially joined in BJP. Now on wards no representation for TDP in Rajyasabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X