• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప‌వ‌న్ ను ఏమీ అన‌వ‌ద్దు..సీయం : టిడిపి - జ‌న‌సేన పొత్తు దిశగా : జ‌న‌సేనాని సిద్ద‌మేనా..!?

|
  AP Election 2019 : Chandra Babu Says To Leaders 'Don't Make Negative Comments On Pawan | Oneindia

  ప‌వ‌న్ ను క‌లిసి రావాల‌ని ఆహ్వానించారు. వ‌ప‌న్ నో అన్నారు. అయినా..టిడిపిలో ఇంకా ఆశ‌లు. త‌మ‌తో ప‌వ‌న్ క‌లిసి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం వారిలో క‌నిపిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్‌- వ‌ప‌న్‌-మోదీ-కేసీఆర్ ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేసిన టిడిపి నేత‌ల్లో స‌డ‌న్ ఛేంజ్‌. ఈ లిస్టు నుండి ప‌వ‌న్ పేరుకు మిన‌హాయింపు. మిగిలిన ముగ్గురూ లక్ష్యంగా విమ‌ర్శ‌లు. తాజాగా, పార్టీ నేత‌ల టెలి కాన్ఫిరెన్స్‌లో ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించిట్లుగా వ‌స్తున్న వార్త‌లు టిడిప -జ‌న‌సేన మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలిస్తున్నాయి. మ‌రి నో చెప్పిన ప‌వ‌న్ ఎస్ అంటారా..

  ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు వ‌ద్దు .. చెప్పింది చేయండి..!

  ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు వ‌ద్దు .. చెప్పింది చేయండి..!

  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలి కాన్పిరెన్స్ నిర్వ‌హించారు. అందులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహాల పై ప‌లు సూచ‌న‌లు చేసారు. అదే స‌మ‌యంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై టిడిపి నేతలు ఎవరూ విమర్శలు చేయవద్దని టిడిపి అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన‌ట్లు వార్తలు స‌మాచారం.నేతల టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ బిజెపి, టిఆర్ఎస్ ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ లపై విమర్శలు చేయాలని , ఆంద్రాకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఉందని ద్వేష ప్రచారం చేయాలని ఆయన సూచించారు. అదే స‌మ‌యంలో సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించార‌ని తెలుస్తోంది. బుచ్చ‌య్య చౌద‌రి జోక్యం చేసుకొని ప‌వ‌న్ ను కూడా విమర్శించాలి కదా అని అన‌టంతోనే..చంద్రబాబు ఆగ్రహం తెచ్చుకుని తాను చెప్పింది చేయాలని ఆదేశించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గా స‌మాచారం. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ త‌మ‌తో క‌లిసి రావా ల‌ని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. అయితే, ప‌వ‌న్ ఆహ్వానాన్ని తిరస్క‌రించారు.

  జ‌న‌సేన తో పొత్తు కోసం ఎత్తులు..

  జ‌న‌సేన తో పొత్తు కోసం ఎత్తులు..

  2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌- బిజెపి తో పొత్తు కార‌ణంగా టిడిపి లాభ‌ప‌డింది. ఇక‌, ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాన్ టిడిపి పై అవినీతి అరోప‌ణ‌లు చేయ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌టం మొద‌లైంది. వ‌ప‌న్ చేసిన ఆరోప‌ణ‌ల పై టిడిపి నేత‌లు సైతం తీవ్రంగా స్పందించారు. ఇక‌, టిడిపి -జ‌న‌సేన మ‌ధ్య సంబంధాలు దాదాపు తెగి పోయాయి. ఈ మ‌ధ్య కాలంలో స‌డ‌న్ గా వ‌ప‌న్ క‌ళ్యాన్ త‌మ తో క‌లిస్తే జ‌గ‌న్ కు నొప్పి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ త‌మ‌తో క‌లిసి రావాల‌ని ఓపెన్ గా ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానాన్ని ప‌వ‌న్ తిర‌స్కరించారు. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ఎవ‌రితో పొత్తు ఉండ‌ద‌న తేల్చి చెప్పారు. అయినా..టిడిపి నేత‌లు ఎవ‌రూ ప‌న‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు మారుతున్న స‌మీక‌ర‌ణాల‌కు సంకేతాలుగా నిలిచాయి. టిఆర్‌య‌స్‌ నేత ల‌ను ఉద్దేశించి..జ‌గ‌న్ పైనా..ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తిరిగి టిడిపికి దగ్గ‌ర‌వుతున్నారా అనే అనుమానం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో మొద‌లైంది. ఇక‌, గ‌తంలో జ‌గ‌న్ -వ‌ప‌న్ అంటూ విమ‌ర్శించే టిడిపి నేత‌లు ఇప్పుడు ప‌వ‌న్ ను విమ‌ర్శ‌ల లిస్టు నుండి తొలిగించారు.

  ప‌వ‌న్ కళ్యాన్ సిద్దంగా ఉన్నారా..!

  ప‌వ‌న్ కళ్యాన్ సిద్దంగా ఉన్నారా..!

  టిడిపి - వైసిపి పై కొద్ది రోజుల వ‌ర‌కూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన వ‌ప‌న్ క‌ళ్యాన్ కొద్ది రోజులుగా విమ‌ర్శ‌ల‌కు దూరంగ గా ఉంటున్నారు. విజ‌య‌వాడ - గుంటూరు ప‌ర్య‌ట‌న‌ల్లో ప‌రోక్షంగా జ‌గ‌న్ పైనే విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, టిడిపి నేత‌ల నుండి త‌న పై విమ‌ర్శ‌లు ఆగిపోవ‌టంతో..ప‌వ‌న్ సైతం వారి జోలికి వెళ్ల‌టం లేదు. అయితే, ప‌వ‌న్ ఎప్ప‌టికైనా త‌మ‌తో క‌లుస్తార‌ని టిడిపి నేత‌లు ఇంకా న‌మ్మ‌కం తో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి..కొద్ది రోజుల క్రితం టిడిపి తో బంధానికి నో చెప్పిన ప‌వ‌న్..ఇప్పుడు ఎస్ అంటారా అనే చ‌ర్చ మొద‌లైంది. వామ‌ప‌క్షాల తో జ‌త క‌ట్టిన ప‌వ‌న్ ..వారిని కాద‌ని టిడిపి తో క‌లిసి వెళ్లే ప్ర‌సక్తి ఉండ‌ద‌ని కొంద‌రి విశ్లేష‌ణ‌. అయితే, టిడిపి నేత‌లు ప‌వ‌న్ త‌మ‌తో క‌లుస్తారే న‌మ్మ‌కం లేకుంటే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ కొన‌సాగించే వార‌ని...టిడిపి రాజ‌కీయంగా లక్ష్యంగా చేసుకున్న వారిలో ప‌వ‌న్ లేక‌పోవ‌టంతో..ఇక పొత్తు కోసం టిడిపి ప‌వ‌న్ పై ఒత్తిడి పెంచుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. మ‌రి..వ‌ప‌న్ క‌ళ్యాన్ టిడిపి ఒత్తిడికి లొంగు తారా..లేక ఇప్ప‌ట‌కే చేసిన ప్ర‌క‌ట‌న మీదే నిల‌బ‌డ‌తారా అనేది చూడాల్సిందే..

  English summary
  TDP Chief Chandra Babu directed pary leaders should not do negative comments on Pawan kalyan. Now these indications predicting once again alliance between TDP and pawan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X