అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఇంటిని ఖాళీ చేయడం నైతిక బాధ్యత.. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా : ఆర్కే

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తిని అప్పగించాలనే విషయం చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఆ నైతిక బాధ్యత తనకు లేదా అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదేనని 2016, మార్చి 2వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఆయనే వెల్లడించారని గుర్తు చేశారు.

చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఆర్‌డీఏ నోటీసుపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. లింగమనేని రమేష్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఓసారి సరిచూసుకోవాలని సూచించారు. 2016 సంవత్సరంలో తన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు లింగమనేని చెప్పిన విషయం ఆర్కే గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా ఆ ఇల్లు తనదేనంటూ లింగమనేని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!

tdp vs ycp mla alla ramakrishna reddy fires on chandrababu naidu

లింగమనేనిని చంద్రబాబు అనేక రకాలుగా బెదిరించారని.. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు ఆర్కే. అయితే చంద్రబాబు ఉంటున్న ఇల్లు మీకు చెందిందా లేదంటే ప్రభుత్వానిదా అనే విషయం స్పష్టం చేయాలని కోరారు. ఏదిఏమైనా చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయకపోవడం మాత్రం సరైన పద్ధతి కాదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భవనాన్ని పట్టుకుని సొంత ఇల్లులా ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారని ప్రశ్నించారు. నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Mangalagiri MLA Alla Ramakrishna Reddy made allegations on AP Ex CM Chandrababu Naidu. He questioned that why chandrababu playing dramas in house vacate. His residence built with government funds not only with his self funds, reddy argued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X