అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రర్.. ఎర్రర్: టీడీపీ అధికారిక వెబ్ సైట్ కు ఏమైంది? కొన్ని గంటలుగా మూత

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వాలను కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్ మూతపడింది. గురువారం ఉదయం నుంచి ఈ వెబ్ సైట్ ఓపెన్ కావట్లేదు. www.telugudesam.org అనే యుఆర్ఎల్ ను టైప్ చేయగానే.. ఎర్రర్ చూపిస్తోంది. ఉదయం 10:04 నిమిషాలకు వెబ్ సైట్ షట్ డౌన్ అయినట్లు సూచిస్తోంది.

ఏపి ఆర్దిక మూలాల పై దాడి : సోదాల పేరుతో దొంగ‌త‌నం చేస్తారా : బాబు సంచ‌ల‌నం..! <br>ఏపి ఆర్దిక మూలాల పై దాడి : సోదాల పేరుతో దొంగ‌త‌నం చేస్తారా : బాబు సంచ‌ల‌నం..!

ఏ పార్టీ అయితే డేటాను చోరీ చేసిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నదో.. అదే పార్టీకి చెందిన అధికారిక వెబ్ సైట్ మూతపడటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. డేటా చోరీ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వెబ్ సైట్ కొన్ని గంటలుగా మూత పడటం సరికొత్త సందేహాలకు కారణమౌతోంది.

Telugu Desam Party Official website

డేటా చోరీకి, వెబ్ సైట్ కు సంబంధాలు ఉన్నాయని, అందువల్లే దాన్ని షట్ డౌన్ చేసి, అందులో ఉన్న వివరాలను కూడా తొలగిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెబ్ సైట్ ఎందుకు పని చేయట్లేదనే విషయంపై తెలుగుదేశం పార్టీ నుంచి గానీ, ఆ పార్టీ ఐటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విభాగం నుంచి గానీ ఎలాంటి సమాధానం రాలేదు.

Telugu Desam Party Official website

ఉద్దేశపూరకంగానే టీడీపీ నాయకులు వెబ్ సైట్ కార్యకలాపాలను నిలిపివేశారని అంటున్నారు. ఇందుకు కారణాలు తెలియరావట్లేదు. వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వారికి, ఇది క్లౌడ్ ఫేర్ నెట్ వర్క్ పై ఉందని, ప్రస్తుతం అది పనిచేయడం లేదన్న సమాచారం కనిపిస్తోంది. సేవా మిత్రలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్ లోనే పొందుపరిచారు.

English summary
Telugudesam.org website, which is run by ruling party in Andhra Pradesh shut down from Thursday morning. In the row of Data theft case, many people raises eyebrow for this attempt. IT Grid Private Limited, which is developed the TDP official App Seva Mitra, facing the data theft case in Hyderabad. Hyderabad City Police filed a case against this theft, and started enquiry. In this juncture, TDP official web site went shut down for many hours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X