అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: ఏపీ మంత్రి సురేశ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. అన్నీ చోట్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే వైరస్ దృష్ట్యా సీబీఎస్ఈ పరీక్షల్లో మార్పు చేర్పులు చేసింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి షెడ్యూల్ మార్చింది. తాత్కాలికంగా పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్టేట్ సిలబస్‌పై ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతోంది.. పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే సంశయం కొనసాగుతోంది.

ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలుఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.

tenth, inter exams are as per schedule: minister suresh

భవిష్యత్‌లో కరోనా కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం జగన్‌తో సమీక్షించి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. ఇప్పటికీ అయితే షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సీబీఎస్ఈ పరీక్షల దృష్ట్యా స్టేట్ బోర్డు పరీక్షలపై సందేహాలు వస్తున్నాయి. దీనిపై మంత్రి సురేశ్ స్పందించారు. కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.

English summary
tenth, inter exams are as per schedule in andhra pradesh minister suresh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X