• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఓప‌క్క అత్యుత్త‌మ సాంకేతిక‌త‌..! మ‌రో ప‌క్క కుల గ‌జ్జి..! ఏపిలో నెల‌కొన్న విచిత్ర రాజ‌కీయాలు..!!

|

హైద‌రాబాద్ : ఏపిలో రాజ‌కీయాలు సాంకేతిక‌త‌తో ముందుకు వెళ్తున్నాయో.. కుల రాజ‌కీయాల‌తో తిరుగ‌మిస్తున్నాయో అర్థం కాని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చంద్ర‌బాబు సార‌థ్యంలో త్యుత్త‌మ సాంకేతిక‌త‌తో ఏపి పరుగులు పెడుతుంటే అదే స‌మ‌యంలో కుల రాజ‌కీయాలు సైతం ఏపిలో విక‌టాట్టహాసం చేస్తున్నాయి. ఈ సంప్ర‌దాయం ఏపి అభివ్రుదికి శ‌రాఘాతంలా ప‌రిణ‌మించినా నియంత్రించే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వాలు మారుతున్నా వాటి వెన‌క కుల ర‌క్క‌సి మారుతుంది త‌ప్ప పూర్తిగా అంతం కావ‌డం లేదు. ఎంత‌కాలం ఈ ప‌రిస్థితి..? ఎన్నాళ్లు ఈ దుస్థితి..?

ఏపిలో తారా స్థాయిలో కుల రాజ‌కీయాలు..! ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షం..!!

ఏపిలో తారా స్థాయిలో కుల రాజ‌కీయాలు..! ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షం..!!

ఏపీలో కుల పంచాయ‌తీలు, వ‌ర్గాలుగా విడిపోవ‌టాలు కొత్తేం కాదు. 1970 ద‌శ‌కంలో మొద‌లైన వ‌ర్గ‌పోరు 1980లో కోర‌లు చాచింది. ఇప్పుడు అది ఏకంగా ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టేంత వ‌ర‌కూ చేరింద‌నే చెప్పాలి. కులాల కుంప‌ట్లు వెనుక ఆధిప‌త్యం సాదించాల‌నే నాయ‌కులు, ఆ త‌రువాత రాజ‌కీయంగా ల‌బ్దిపొందాల‌ని భావించిన పెద్ద‌ల బుర్ర‌ల నుంచి ఇది విష‌సంస్కృతిగా మారింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో మొగ్గ‌తొడిగిన బీజాలు, క్ర‌మంగా ఏపీ వ్యాప్తంగా వ‌ట వ్రుక్షం మాదిరి ప్ర‌భావం చూపుతున్నాయి. వైసీపీ అదినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ సాక్షిగా కులాల కుంప‌ట్ల‌ను క‌దిలించిన నేప‌ధ్యంలో ఏపి లో నెల‌కొన్న కుల రాజ‌కీయాల‌పై ఓ క‌న్నేయాల‌నిపించింది.

ప‌దోన్న‌తుల్లో బ‌య‌ట‌ప‌డ్డ కులాల కుంప‌టి..! అదేం లేదంటున్న ఏపి స‌ర్కార్..!!

ప‌దోన్న‌తుల్లో బ‌య‌ట‌ప‌డ్డ కులాల కుంప‌టి..! అదేం లేదంటున్న ఏపి స‌ర్కార్..!!

ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం గోప్యంగానో, మీడియా వ‌ర‌కూ ప‌రిమిత‌మైన అంశాన్ని ప్ర‌తిప‌క్ష నేత చ‌ర్చ‌నీయాంశంగా మార్చార‌నే చెప్పాలి. ఏపీలో ఇటీవ‌ల 37 మంది సీఐల‌కు డీఎస్పీలుగా ప‌దోన్న‌తులు క‌ల్పించారు. వీరిలో 35 మంది క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు ఉన్నార‌నేది జ‌గ‌న్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 2004-2014 వర‌కూ ప‌దోన్న‌తులు పొందిన అధికారుల జాబితాలో రెడ్డి వ‌ర్గ‌మే అధికంగా ల‌బ్దిపొందింద‌నేది టీడీపీ వైపు నుంచి వ‌చ్చే కౌంట‌ర్ స‌మాధానం. చెల్లుకు చెల్లు అనేంతగా ఇరు పార్టీలు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకోవ‌డం విశేషం.

ప‌రాకాష్ట‌కు చేరుతున్న కుల రాజ‌కీయాలు..! నియంత్రించే నాథుడే లేడా..?

ప‌రాకాష్ట‌కు చేరుతున్న కుల రాజ‌కీయాలు..! నియంత్రించే నాథుడే లేడా..?

వాస్త‌వానికి కులాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని ప‌దోన్న‌తులు, పోస్టింగ్‌లు ఇవ్వ‌టం ఇదేం కొత్త‌కాదు. కానీ గ‌త ప‌దేళ్లుగా ఇది తారాస్థాయికి చేర‌ట‌మే కులాల మ‌ధ్య మ‌రింత అగ్గిరాజేసింది. ఇప్పుడి ఎన్నిక‌ల స‌మ‌యం, పైగా ఏపీలో మూడు పార్టీల‌ను మూడు కులాలను సొంతం చేసుకుంటున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఒక‌ర్నొక‌రు రెచ్చ‌గొట్టుకుంటూ పోలీసు కేసుల వ‌ర‌కూ చేరుకుంటున్నాయి కుల రాజ‌కీయాలు.

అభివ్రుద్దితో పోటీ ప‌డుతున్న కుల రాజ‌కీయాలు..! చోద్యం చూస్తున్న యంత్రాంగం..!!

అభివ్రుద్దితో పోటీ ప‌డుతున్న కుల రాజ‌కీయాలు..! చోద్యం చూస్తున్న యంత్రాంగం..!!

కేవ‌లం త‌మ అభిమానాన్ని బావోద్వేగంతో ముడిపెట్టి జుగుప్సాక‌ర‌మైన కామెంట్స్ చేయ‌ట‌మే దీనికి కార‌ణం. ఈ అరెస్టుల‌తో వీటికి పుల్‌స్టాప్ ప‌డుతుందా అంటే లేద‌నే స‌మాదానం వినిపిస్తుంది. ఇటువంటి సమ‌యంలో జ‌గ‌న్ వేసిన కుల ప‌దోన్న‌తుల ప్ర‌శ్న‌పై చంద్ర‌బాబు ఆచితూచి స్పందించారు. కాద‌ని.. చెప్ప‌లేదు. ఔన‌ని అన‌లేదు. న‌ర్మ‌గ‌ర్బంగా తాను అన్ని కులాల‌కు ప్రాదాన్య‌త‌నిస్తానంటూ దాట‌వేసారు. ఇది ఇంత‌టితో స‌మ‌సిపోతుందా అంటే చెప్ప‌టం క‌ష్ట‌మే. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న వేళ కులాల మ‌ద్య ఎమోష‌న్స్‌ను రెచ్చ‌గొట్టి, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య తలెత్తేందుకు కార‌ణం కావ‌చ్చనే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. మ‌రి ఏపిలో నెల‌కొన్న కులాల కుర‌క్షేత్రం ఎప్ప‌టివ‌ర‌కు స‌మ‌సిపోతుందో చూడాలి.

English summary
In politics AP politics go ahead with remarkable development. At the same time, caste politics also make a distinction in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X