• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోజా ముద్దు పెట్టింది..!లిప్ స్టిక్ అంటిందని బుగ్గ తుడిచింది..! అమరావతిలో 'జబర్దస్త్' సంఘటన..!!

|

అమరావతి/హైదరాబాద్ : జబర్ధస్త్ వేదిక మీద ఆమె నవ్వు గలగలపారే ఓ జలపాతం. రాజకీయ వేదికల మీద ఆమే మాటలు ప్రత్యర్థుల గుండెల్లోకి దూసుకుపోయే తూటాలు. ఆమె ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు, రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది ఆమె ఎవరో. పరిచయం అక్కరలేని ఆమే పేరే ఆర్కే రోజా. ఏపి రాజకీయాలు ఆమె ప్రస్ధావన లేకుండా ముందుకు వెళ్లవంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇటీవల అమరావతిలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. తోటి నాయకురాలిని రోజా మనసారా ముద్దుపెట్టుకుంది.

అవును మీరు విన్నది నిజమే.. తనతో పాటు రాజకీయాల్లో సుధీర్గ ప్రస్థానం చేసిన తొటి నయకురాలుకు నామినేటెడ్ పదవి వరించడంతో ఆమెను గాఢంగా ముద్దాడింది నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకపోయినా సినిమా బ్యాక్ డ్రాప్ రోజాకు ఉంది కాబట్టి అలా వ్యవహరించిందనే చర్చ కూడా జరుగుతోంది.

The lipstick is a clinging cheek..!Jabardast incident in Amravati..!!

రోజా మరో ప్రముఖు నాయకురాలిని ముద్దాడిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఆసక్తికరంగా మారితే, ముద్దు తర్వాత ముచ్చట అందరిని విపరీతంగా ఆకర్షించటమే కాదు, నవ్వుకునేలా చేయటం విశేషం. ఇంతకూ గిందేమంటే, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ నియమితులు కావటం తెలిసిందే.

ఈ పదవికి సీఎం జగన్ నియమించినా, సాంకేతిక కారణాలతో ఆ పదవిని స్వీకరించే విషయంలో వాసిరెడ్డి పద్మకు కాస్త ఆలస్యమైంది. ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కమ్ ఎఐసీసీ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న ఆర్కే రోజా కూడా హాజరయ్యారు. వాసిరెడ్డి పద్మకు, రోజాకు మధ్య అనుబంధం కూసంత ఎక్కువ. దీంతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు ముద్దిచ్చారు రోజా. పద్మ బుగ్గ మీద సోదరి భావంతో ముద్దాడిన రోజా, తన పెదాలకున్న లిప్ స్టిక్ అంటిందన్న ఉద్దేశంతో ఆమె బుగ్గను తానే స్వయంగా తుడవటం ఆసక్తికరంగా మారింది.

వారిద్దరిమధ్య ఉన్న అనుబంధానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు. తనకు ముద్దుపెట్టి, లిప్ స్టిక్ అంటిందేమోనన్న ఉద్దేశంతో తన బుగ్గను తుడిచిన రోజాను చూసుకొని పద్మ నవ్వులు చిందించారు. ఈ కార్యక్రమానికి ఈ సీన్ ప్రముఖంగా మారటమే కాదు, అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

English summary
Roja and Vasireddy Padma has much intimacy.Roja was kissed by her as a woman commission chairperson. Roja, who kissed Padma cheek, became interesting to wipe her cheek herself with the intention of clinging to her lip stick marks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more