అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పూనం కౌర్‌ను కూడా వేధించింది వాడే!వాన్ని తంతే వెనకాల ఉన్న టీడీపీ నేతలు బయటకు వస్తారు:లక్ష్మీపార్వతి

|
Google Oneindia TeluguNews

తనపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్నారు లక్ష్మీ పార్వతి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ పార్వతిపై ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు. తనపై అసభ్య ఆరోపణలు చేసిన వ్యక్తికి సరైన శిక్ష పడాలని వైసీపీ నేత లక్ష్మీపార్వతి కోరారు. సోషల్ మీడియా వేదికగా నటి పూనం కౌర్, లక్ష్మీపార్వతిపైనా అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒకరేనని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కానీ నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే అతని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని లక్ష్మీ పార్వతి చాలా గట్టిగా వాదిస్తున్నారు.

తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ

 ల‌క్ష్మీ పార్వ‌తి..సినీ న‌టి పూనం కౌర్‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధించింది ఒక్కరేనని తేల్చిన సైబరాబాద్ పోలీసులు

ల‌క్ష్మీ పార్వ‌తి..సినీ న‌టి పూనం కౌర్‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధించింది ఒక్కరేనని తేల్చిన సైబరాబాద్ పోలీసులు

వైసీపీలో కీలకనేతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ల‌క్ష్మీ పార్వ‌తి..సినీ న‌టి పూనం కౌర్‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధించిన వారిని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇద్ద‌రినీ వేధించింది ఒక్క‌రేన‌ని తేల్చారు. ఈ మేర‌కు సైబ‌ర్ పోలీసులు ప్రాధ‌మిక ఆధారాలు సేకరించారు. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌నున దెబ్బ‌తీసేందుకు ఉద్దేశ పూర్వ‌కంగా కొంద‌రు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లో అస‌భ్య క‌ధ‌నాలు పోస్టు చేస్తున్నారంటూ ల‌క్ష్మీ పార్వ‌తి..పూరం కౌర్ ఇద్ద‌రూ వేర్వేరుగా సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. వీరి ఫిర్యాదుల ఆధారంగా విచార‌ణ చేసిన పోలీసులు ఇద్ద‌రినీ వేధిస్తున్న‌ది ఒక్క‌రేన‌ని గుర్తించారు. అయితే, పోలీసులు నిందితుడిని గుర్తించినా..ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. ఆ వ్య‌క్తికి మ‌రొక‌రు తోడుగా ఉన్నట్లు విచార‌ణ‌లో తేలింది. హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ నుండి వాళ్లు త‌మ కార్యాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు తేల్చారు.

తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని నాలుగు తంతే వెనక ఉన్నవారు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతి

తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని నాలుగు తంతే వెనక ఉన్నవారు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతి

తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నిందితుడిని అరెస్టు చేసి, నాలుగు తంతే, దీని వెనుక ఉన్నదెవరో బయటకొస్తుందని అన్నారు. అది టీడీపీనేనని ఆమె అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబువల్ల ఎన్నో భరించానని ఆమె చెప్పుకొచ్చారు. ఒక తల్లి వయసు ఉన్న తాను ఓ బిడ్డ లాంటి వాడికి మెస్సేజ్ లు పంపించానంటే ఎవరైనా నమ్మే విషయమేనా? అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు నీచుడని, మొదటి నుండి ఎన్నో అవమానాలు చేశారని ఆమె అన్నారు. ఒక తల్లి లాంటి వ్యక్తిని బజారులో పెట్టాలనుకున్న నీచుడికి సరైన శిక్ష పడాలని కోరారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నిందితుడు నివసించే గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నానని, అతన్ని పోలీసులు పట్టుకునేందుకు సహకరించాలని లక్ష్మీ పార్వతి కోరారు.

చంద్రబాబు కుట్రలను మొదటి నుండీ ఎదుర్కొంటున్నానన్న లక్ష్మీ పార్వతి

చంద్రబాబు కుట్రలను మొదటి నుండీ ఎదుర్కొంటున్నానన్న లక్ష్మీ పార్వతి

తాను చంద్రబాబు కుట్రలను మొదటనుండీ ధైర్యంగా నిలబడుతూ వాటిని ఎదుర్కొన్నాను. నా ధైర్యం.. నా నిజాయతి, నా విశ్వాసం' నన్ను కాపాడాయి అని అన్నారు లక్ష్మీ పార్వతి . తనపై అసభ్య ఆరోపణలు చేసిన నిందితుడిని గుర్తించిన సైబరాబాద్ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు ఎన్నో సైబరాబాద్ పోలీసులు పరిష్కరించారని మెచ్చుకున్న లక్ష్మీ పార్వతి ఏపీ పోలీసులకు ఆ దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా ఉన్నారని ఆరోపించారు. అందుకే, సరైన నిర్ణయాలు వారు తీసుకోలేరని భావించే ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.

English summary
Lakshmi Parvati taken social media as platform, and said that the man who posted posts against her has made ungodly remarks and the TDP leaders will come out as if they have committed indecent charges against him. Lakshmi Parvati urged him to be punished for allegedly blamming her. Cyderabad police identified that the man who blammed Lakshmi parvathi is the same man who also commented badly on Poonam Kaur . Lakshmi parvathi is strongly saying that the TDP leaders are behind this man and making him to post on Lakshmi parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X