• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ, తెలంగాణ లీడర్లకు 'నాయుడు' టెన్షన్.. ఆల్ టైమ్ రికార్డే మరి..!

|

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల నాయకుల్లో కొందరికి ఆ "నాయుడు" సుపరిచితుడు. మామూలు పరిచయం కాదు. ఎంతలా అంటే జీవితంలో మరిచిపోలేనంత. ఇంతకు ఆ నాయుడు ఎవరు.. అతడికి రాజకీయ నాయకులకు సంబంధమేంటి. ఇలాంటి ప్రశ్నలకు ఆ నాయుడు చేసిన మోసాల చిట్టా సమాధానం చెబుతుంది. సామాన్యులను మోసం చేసినంత ఈజీగా బడా బడా నేతలను సైతం ముగ్గులోకి దించి కోట్లు కొల్లగొట్టిన ఆ నాయుడు.. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా పదేపదే మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. లీడర్లను బురిడీ కొట్టిస్తూ 21 సార్లు జైలు పాలైన నాయుడు మరోసారి పోలీసులకు చిక్కడంతో మోసాల చిట్టా వెలుగుచూసింది.

తోట.. నేతల వేట..!

తోట.. నేతల వేట..!

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన 40 సంవత్సరాల తోట బాలాజీనాయుడు గుంటూరు జిల్లా తెనాలిలో నివాసం ఉంటున్నాడు. మోసాలు చేయడంలో ఆరితేరాడు. ఎన్టీపీసీ రామగుండంలో ఏఈగా ఉద్యోగం చేశాడు. తెనాలికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు టాక్. 2008లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించాలని మోసాలకు తెర తీశాడు. ప్రభుత్వ ఉన్నతాధికారులుగా అవతారమెత్తుతూ.. ప్రభుత్వ పథకాల పేర్లు చెబుతూ, నిధులు వచ్చాయని రాజకీయ నాయకులను నమ్మబలికేవాడు.

లీడర్లను బురిడీ కొట్టించడంలో ఆరితేరిన బాలాజీ నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను మంజూరు చేయిస్తానంటూ మోసగించేవాడు. ఆ క్రమంలో ఇదివరకు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతడి బుద్ది మాత్రం మారలేదు. ఇదివరకు ఎంతోమంది నేతలను మోసగించిన బాలాజీని గతవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై దాదాపు 60 ఛీటింగ్ కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 21 సార్లు జైలుకు వెళ్లొచ్చినట్లు తెలిపారు.

మరిదితో అక్రమ సంబంధం.. కొడుకు లైంగికంగా వేధిస్తున్నాడని.. చివరకు ఏమైందంటే..!

కేంద్ర ప్రభుత్వ నిధుల పేరిట టోకరా

కేంద్ర ప్రభుత్వ నిధుల పేరిట టోకరా

తోట బాలాజీ నాయుడు మోసాల చిట్టాలో చాలామంది లీడర్లు బాధితులుగా ఉన్నారు. ఇప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓ బాధితుడే. కేంద్రం నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి రావాలంటే కొంత మొత్తం చెల్లించాలంటూ మోసగించాడు. అదే క్రమంలో 2017 సెప్టెంబరు 12న ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్‌ చేసిన నాయుడు.. తాను కేంద్రంలో ఉన్నతోద్యోగినని, ప్రభుత్వ పథకాలకు చెందిన 2 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని నమ్మబలికాడు. అవి విడుదల చేయించాలంటే 5 శాతం ముందుగా చెల్లించాలని నమ్మించి 10 లక్షలు కొట్టేశాడు.

అలా ఈ ఏడాది ఫిబ్రవరి 28న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహకు ఫోన్‌ చేసి తాను ఆర్థికశాఖలో డిప్యూటి సెక్రటరీనంటూ చెప్పుకొని 2.5 లక్షలు కొట్టేశాడు. 25 లక్షల వరకు లోన్ వస్తుందని చెప్పి బురిడీ కొట్టించాడు. తీరా మోసపోయినట్టు గ్రహించిన జయసింహ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. జనవరిలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతికి ఫోన్ చేసి, 1.25 లక్షలు నొక్కేశాడు.

సూర్యాపేట పోలీసులకు చిక్కాడిలా..!

సూర్యాపేట పోలీసులకు చిక్కాడిలా..!

తోట బాలాజీ నాయుడు మహా మాయగాడు. లీడర్లను బురిడీ కొట్టించడంలో నంబర్ వన్. తెలుగు రాష్ట్రాల్లో అతడి మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతడి చేతిలో మోసపోయారు. తాజాగా సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవల్లిక భర్త ప్రకాశ్‌ నుంచి 30 వేల రూపాయలు కాజేసి పోలీసులకు పట్టుబడ్డాడు. లోకల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

అభివృద్ధి పథకాలపై పట్టుతో..!

అభివృద్ధి పథకాలపై పట్టుతో..!

అభివృద్ధి పథకాలపై అలవోకగా మాట్లాడతాడు నిందితుడు. దాంతో ఎవరికి కూడా అనుమానం రాదు. అతడు చెప్పే విధానం కూడా అలా ఉంటుంది. ఎదుటివారిని నమ్మించి బోల్తా కొట్టించడంలో మహా ముదురు. ఆ క్రమంలో లీడర్లను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతున్నాయని.. అవి మీకు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించేవాడు. అందుకు కొంత మొత్తం డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికేవాడు.

వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్‌లో ఫసక్..!

 పక్కా స్కెచ్.. ఇతరుల బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చి..!

పక్కా స్కెచ్.. ఇతరుల బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చి..!

ఏ లీడర్‌నైనా టార్గెట్ చేసుకుంటే ముందుగానే పథక రచన చేసుకునేవాడు. ఆ క్రమంలో తన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకుండా ఇతరుల అకౌంట్ నంబర్లు ఇచ్చేవాడు. అయితే సదరు బ్యాంకు ఖాతాదారులను అప్పటికప్పుడు పరిచయం చేసుకుని వారికి మందు పోయించి మచ్చిక చేసుకునేవాడట. అలా ఎవరైనా బకారా దొరికి డబ్బు డిపాజిట్ చేసే క్రమంలో ఎవరిదైతే బ్యాంకు అకౌంట్ నంబర్ ఇచ్చాడో వారికి కొంత మొత్తం ముట్టజెప్పి మిగతా సొమ్ము డ్రా చేసుకుని ఉడాయించేవాడు.

2010 నుంచి ఇప్పటివరకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాలాజీనాయుడు చేతిలో మోసపోయారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు టోకరా వేసినట్లు అంచనా. కొందరు ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో పలుమార్లు హైదరాబాద్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. 2016లో అతనిపై పీడీ యాక్టు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. విడుదల కాగానే ఎప్పటిలాగా మోసాలు కొనసాగిస్తున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"Naidu" is familiar to some of the leaders of Telugu states. Not the usual introduction. How much does life forget. Who is that Naidu .. How He is connected to politicians. A log of the frauds of Naidu answers such questions. Naidu, who was so easy to cheat the leaders as common people. Even after going to jail, repeatedly commit fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more