అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP Inter 2nd Year Results: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు..!

|
Google Oneindia TeluguNews

ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫలితాలను వెలగపూడి సచివాలయంలో గల పబ్లిసిటీ సెల్‌లో రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఈ మేరకు ఒక ప్రకటనలో బోర్డు తెలిపింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేస్తారని వివరించింది. కరోనా అన్ని పరీక్షలపై అదే సమయంలో ఫలితాలపై కూడా ప్రభావం చూపింది. ఇక ఈ రోజు ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులంతా కాస్త టెన్షన్‌గా ఫీలవుతున్నారు.

విద్యార్థులు examresults.ap.nic.in, results.bie.ap.gov.in, results.apcfss.ac.in, bie.ap.gov.in వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొన్నది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విద్యార్థులకు వచ్చిన మార్కులు, సెకండ్ ఇయర్‌లో ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని ఇంటర్ బోర్డు తెలపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని వివరించింది.

tomorrow inter second year exam result release

Recommended Video

AP Inter Exams 2021: Hall Tickets వచ్చేసాయ్, పరీక్షలు రద్దు చేయాలని KA Paul డిమాండ్| Oneindia Telugu

కరోనా విజృంభించడంతో సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎగ్జామ్స్ నిర్వహించకుండానే ప్రమోట్ చేసింది. 12వ తరగతి వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో వెనక్కి తగ్గింది. వారిని కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఇలా అన్నీ తరగతుల పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఒక ఎంసెట్ లాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తున్నారు.

English summary
tomorrow inter second year exam result release inter board said in statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X