అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నిక‌ల్లో మాధ‌వ్ తొలి విజ‌యం..విఆర్‌య‌స్ ఆమోదించాల‌ని ట్రిబ్యున‌ల్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి..అదే స్థాయిలో వైసిపి నుండి హిందూపూర్ ఎంపి అభ్య‌ర్దిగా సీటు ద‌క్కించుకున్న పోలీసు మాధ‌వ్ కు తొలి విజ‌యం ద‌క్కింది. ఆయ‌న స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ ఆమోదించ‌కుండా..ఎన్నిక‌ల్లో పోటీకి ఇబ్బందులు క‌లిగించే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దీని పై మాధ‌వ్ న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు.

వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలు వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలు

ట్రిబ్యున‌ల్ ఆదేశం..


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామి నేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై ట్రిబ్యునల్‌ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యు నల్‌ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్‌ వేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ క్రమంలో ఆయన నామి నేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. దీని పై ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. ట్రిబ్యున‌ల్ ఆదేశం మేర‌కు ఆమోదిస్తుందా లేద అప్పీల్ కు వెళ్తుందా అనేది చ‌ర్చ నీయాంశంగా మారింది. ఈ తీర్పు ద్వారా మాధ‌వ్ ఎన్నిక‌ల్లో పోటీకి లైన్ క్లియ‌ర్ అయింద‌ని వైసిపి నేత‌లు భావిస్తున్నారు.

Tribunal ordered Accept madhav VRS : now eligible for filing nomination

ప్ర‌త్యామ్నాయాల పై వైసిపి దృష్టి..
నామినేష‌న్ల స‌మ‌యం ముగుస్తున్న వేళ మాధ‌వ్ విష‌యంలో వైసిపి నేత‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. ట్రిబ్యున‌ల్ తీర్పు పై ఏపి ప్ర‌భుత్వ ఆమోదిస్తే మాధ‌వ్ నే బ‌రిలోకి దించాల‌ని..ఒక వేళ అప్పీల్ కు వెళ్తే ఏం చేయాల‌నే దాని పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా హిందూపూర్ కు కురుభ సామాజిక వ‌ర్గానికి ఎంపి సీటు కేటాయించాల‌ని నిర్ణ‌యించ‌టంతో మాధ‌వ్ కు అవ‌కాశం ద‌క్క‌క పోతే..ఆయ‌న స్థానంలో రిటైర్డ్ జిల్లా జ‌డ్జి అయిన కురుబ కిష్ట‌ప్ప పేరు ను వైసిపి ప‌రిశీలిస్తోంది. ఎన్నిక‌ల వేళ ట్రిబ్యున‌ల్ తీర్పు ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. దీని పై గురువారం స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

English summary
AP Tribunal given direction in favour of Hindupur YCP mp candidate Gorantla madhav . Tribunal ordered that govt should accept Madhav VRS. Now Madhav got eligibility for filing nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X