అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు కలెక్టర్లపై చర్యలు..ఎస్ఈసీ ఆదేశాలతో జీఏడీకి సరెండర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ పోరు జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకెళ్తున్నారు. అయితే తాను చెప్పిన మాట వినని అధికారులను తప్పిస్తున్నారు. ఇతర చోటకి బదిలీ/ లేదంటే జీఏడీకి సరెండ్ చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు కలెక్టర్లను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి ప్రభుత్వం సరెండర్ చేసింది. కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తా జీఏడీకి సరెండ్ చేసింది. జేసీలు దినేష్ కుమార్, మార్కండేయులకు కలెక్టర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి పరిపాలన శాఖకు అటాచ్ చేసింది. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీ బాధ్యతలు అప్పగించింది. ఎస్ఈసీ సూచనలతో ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది.

two ias surrender to gad in andhra pradesh

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. ఇవాళ ఇద్దరు కలెక్టర్లను జీఏడీకి సరెండర్ చేయాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Recommended Video

#TOPNEWS : #RepublicDay2021|AP Panchayat Election Re Schedule|Padma Awards 2021 | Oneindia Telugu

English summary
two ias officers surrender to gad in andhra pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X