యువత గుండెల్లో కొలువై.. యువశక్తి ప్రతీకగా నిలిచి, స్వామి వివేకానంద జయంతిపై లోకేశ్..
స్వామి వివేకానంద.. వేదాంత, ఆధ్యాత్మిక వేత్త. అతి పిన్న వయస్సులోనే భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. విదేశీ పర్యటనలు/ తీరిక లేకుండా గడపడంతో 39 ఏళ్ల వయస్సులోనే చనిపోయారు. కానీ అతని బోధనలు యువతకు స్ఫూర్తి దాయకం. నేడు వివేకానంద జయంతి.. ఆయన బర్త్ యానివర్సరీని ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫోటోలు: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నేతలు
అమెరికా, ఇంగ్లాండ్లో ఉపన్యాసాలు
1863 జవవరి 12 న స్వామీ వివేకానంద జన్మించారు. దేశాన్ని జాగృతం చెయడమే కాక అమెరికా, ఇంగ్లాండులో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ఇచ్చారు. వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. గురువు కోరిక మేరకు అమెరికాలో హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. వివేకానంద వాగ్ధాటికి ముగ్ధులైన అమెరిక జనం బ్రహ్మరధం పట్టారు. చాలా మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాల్లో అడుగిడిన మొదటి హిందూ సన్యాసి వివేకానందే.
షికాగోలో బ్రహ్మరథం..
తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగో, అమెరికాలోని ఇతర ప్రాంతాలలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతకు దిశా నిర్దేశం చేశారు. వివేకానంద చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది.

ప్రపంచానికి చాటిన యోధుడు
వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. స్ఫూర్తినిచ్చే బోధనలతో ఇప్పటికీ భారతీయ యువత గుండెల్లో కొలువై ఉన్నారని ప్రశంసించారు. వివేకానంద అంటే యువశక్తి ప్రతీక అని తేల్చిచెప్పారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతకు నివాళి అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. లోకేశ్ సహా ఇతర ప్రముఖులు కూడా వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.