అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు గేట్లకు అడ్డంగా గోడలు, సచివాలయంలో జోరుగా పనులు.. భద్రతా కోసమా..? వాస్తు దోషమా..?

|
Google Oneindia TeluguNews

అమరావతిలో గల సచివాలయంలో గల రెండు గోడలకు అడ్డంగా గోడలు నిర్మిస్తున్నారు. దీంతో గోడల నిర్మాణం అంశం చర్చకు దారితీసింది. అమరావతిలో గల సచివాలయం చుట్టూ ఆరు గేట్లు ఉన్నాయి. నాలుగు గేట్లను గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. ఏడాదిన్నర క్రితం జగన్ ప్రభుత్వం మరో రెండు గేట్లను ఏర్పాటు చేసింది. ఏడాది తర్వాత ఇప్పుడు ఆ గేట్లకు అడ్డంగా గోడలను నిర్మిస్తోంది. దీంతో ఏం జరుగుతోంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కిజగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కి

రెండు గేట్ల ముందు గోడలు

రెండు గేట్ల ముందు గోడలు

సచివాలయానికి ఉత్తరం దిశలో గేటు, దానికి ఎదురుగా దక్షిణ దిశలో మరో మొదటి బ్లాక్ పక్కనున్న గేటుకు అడ్డంగా గోడ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతోపాటు సచివాలయం వైపు నుంచి అసెంబ్లీకి వెళ్లే ఐదవ గేటుకు అడ్డంగా కూడా గోడ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాణానికి కావలసిన రాళ్లను అక్కడ వేశారు. వాస్తవానికి అసెంబ్లీ అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, పర్మిషన్ రాగానే గేటుకు అడ్డంగా వాల్ నిర్మిస్తారని అధికారులు తెలిపారు.

సెక్యూరిటీ కోసమేనా..?

సెక్యూరిటీ కోసమేనా..?

గేట్లు ఉండగానే నిర్మాణాలు చేపడుతుండటంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనిని కొందరు భద్రతాపరమైన చర్యలు అని అంటుండగా, మరికొందరు వాస్తు కోసమని చెబుతున్నారు. కానీ గేట్లకు అడ్డంగా గోడలు ఎందుకు కడుతున్నారని సచివాలయ ఉద్యోగులు చెవులు కోరుకుంటున్నారు. ఉన్నఫళంగా సచివాలయానికి భద్రతాపర సమస్యలు ఏమయ్యాయని గుసగుసలు పెడుతున్నారు.

ఇదీ రూల్..

ఇదీ రూల్..

వాస్తవానికి సచివాలయంలో కొత్తగా ఏదైనా నిర్మాణం చేయాలన్న, ఉన్న నిర్మాణాలను తొలగించాలంటే సాధారణ పరిపాలన శాఖ అనుమతి తీసుకోవాలి. అయితే గేట్లకు అడ్డంగా గోడలు కట్టే విషయమై జీఏడీకి తెలియదు. ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. తమకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే గోడ నిర్మిస్తున్నామని.. సచివాలయ భద్రతాధికారులు సీఆర్డీఏ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.

English summary
wall constructed in two gates in front of amaravati secretariat.some officials told security reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X