అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు-కేసీఆర్‌లే సీఎంలుగా ఉండాలి: సుమన్, టీడీపీతో పొత్తుపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న వారే ముఖ్యమంత్రులుగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆకాంక్షించారు. ఇప్పటికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుత విజయం సాధించారు. మరో ఐదారు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నాతో సోనియా ఏమన్నారంటే: నాటి ముచ్చట్లపై కేసీఆర్ సంచలనం, మాతో కలిసేందుకు కాంగ్రెస్ నేతల ఫోన్లునాతో సోనియా ఏమన్నారంటే: నాటి ముచ్చట్లపై కేసీఆర్ సంచలనం, మాతో కలిసేందుకు కాంగ్రెస్ నేతల ఫోన్లు

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబే సీఎంగా ఉండాలి

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబే సీఎంగా ఉండాలి

ఆయన గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తాను కోరుకున్నట్లుగానే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎంలుగా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. తెలుగు ప్రజలకు మేలు జరిగేలా ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు.

కేసీఆర్‌ను ఏకిపారేసిన కిల్లి కృపారాణి

కేసీఆర్‌ను ఏకిపారేసిన కిల్లి కృపారాణి

ఏపీకి వస్తానని తెరాస అధినేత కేసీఆర్ చెప్పడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కూడా కేసీఆర్ పైన మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఉంది కనుక తాజాగా జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిందని, కానీ కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే 2019లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయాలని సవాల్ చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపై ఆమె మాట్లాడుతూ.. కూటమి ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. సీట్ల సర్దుబాటు సహా అనేక విషయాల్లో తమకు సమయం సరిపోలేదన్నారు.

టీడీపీతో పొత్తుపై ముందే హెచ్చరించా

టీడీపీతో పొత్తుపై ముందే హెచ్చరించా


తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐలతో కూడిన ప్రజాకూటమిగా బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా నుంచి తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంపముంచుతుందని తాను ముందే హెచ్చరించానని గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడం వల్లే ఓటమి పాలయ్యామని రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుబట్టారు. పొత్తు కారణంగా జరిగిన నష్టంపై అధిష్ఠానానికి ఒక నివేదిక ఇస్తానని, సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీకి వెళ్తానని కేసీఆర్

ఏపీకి వెళ్తానని కేసీఆర్

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహాకూటమి కేవలం 21 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి, తెరాసల మధ్య హోరాహోరీ ఉంటుందనుకుంటే ఫలితం ఏకపక్షంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడంపై కేసీఆర్ స్పందిస్తూ.. తానూ ఏపీకి వెళ్తానని చెప్పారు. కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరొకరు మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకే ఎక్కువగా అవకాశముంది. ధర్మపురి శాసన సభ్యులు కొప్పుల ఈశ్వర్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. శాసనసభ ఎన్నికల ఫలితాలపై గవర్నర్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీర్మాన ప్రతిని శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్ గౌడ్‌, దాస్యం వినయ్‌ భాస్కర్‌, గొంగడి సునీత, పద్మా దేవేందర్ రెడ్డి, రవీంద్ర కుమార్‌ తదితరులు గవర్నర్‌కు అందించారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రులు ఆపద్ధర్మ పదవులకు రాజీనామా చేశారు. ఈ లేఖలను ఎంపీ వినోద్ కుమార్‌ గవర్నర్‌కు అందించారు. గవర్నర్ వాటిని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని గవర్నర్‌ కేసీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా రాజ్ భవన్‌లో ఏర్పాట్లు జరిగాయి. సాధారణ పరిపాలన శాఖ ఆహ్వాన పత్రికలను ముద్రించి, ప్రముఖులకు పంపించింది. వారం రోజుల్లో మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారు.

English summary
What Actor Suman and Telangana Congress leader Vijayashanthi said on TRS winning in Telangana. Actor Suman said that Chandrababu and KCR are better for development in Telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X