అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరదలిపై బావ కన్ను: కోరిక తీర్చాలని వేధింపులు.. చివరికీ వివాహిత..

|
Google Oneindia TeluguNews

బావ.. వరసకు అయినా మరదలిని సోదరిలా చూసుకోవాలి. మంచి, చెడు చెప్పాలి.. అండగా నిలవాలి. కానీ అతను మాత్రం తనలోని మరో కోణాన్ని చూపించాడు. కోరిక తీర్చాలని వేధించసాగాడు. భర్తకు చెప్పుకోలేక.. అతని కోరిక తీర్చలేక ఆ ఇల్లాలు కుమలిపోయింది. చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికీ చనిపోయింది. తాడేపల్లిలో జరిగిన ఘటన కలకలం రేపింది.

తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన అన్నారావు, సత్యవతి కూతురు గీతాసురేఖకు 12 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమ్ముని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అన్న శివశంకర్‌ మరదలిపై కన్ను వేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిజేశాడు.

women suicide over husband brother harassment

తీవ్ర మనస్థాపానికి గురయిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగుల మందు తాగింది. ఆ రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి కూడా వచ్చారు. కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పారు. పిల్లల్ని కూడా బెదిరించారు. వారు అలాగే చెప్పి విలపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Recommended Video

Union Budget 2021:BJP leaders Hail Budget in Telangana బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం-డీకే అరుణ

గీతాసురేఖ ఆత్మహత్యాయత్నం చేసుకున్నా చెప్పకుండా దాచిపెట్టారు. బాధితురాలిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ నిన్న సురేఖ చనిపోయారు. బావ శివశంకర్, మామ ఆదిశేషుపై కేసు నమోదు చేయాలని సురేఖ బంధువులు డిమాండ్‌ చేశారు. తల్లి చనిపోయిందని తెలియడంతో పిల్లలు బోరున విలపించారు. మరదలిని వేధించిన శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
women suicide over husband brother harassment at tadepalli mandal undavalli village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X