అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఇలాకాలో గవర్నర్‌తో జగన్ భేటీ

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి : విజయవాడలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో గవర్నర్ విజయవాడకు చేరుకున్నారు. గేట్‌వే హోటల్‌లో బస చేయనున్న గవర్నర్‌ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అంత‌కుముందు క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు జగన్. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రజలు వైసీపీకి పట్టం కట్టడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30వ తేదీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆ క్రమంలో ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జూన్ 7వ తేదీన కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ చేశారు.

కేసీఆర్ అహంకారం తగ్గించుకో.. తెలంగాణ నీ రాజ్యం కాదు : కాంగ్రెస్కేసీఆర్ అహంకారం తగ్గించుకో.. తెలంగాణ నీ రాజ్యం కాదు : కాంగ్రెస్

ycp chief jagan mohan reddy met with governor in vijayawada

అసెంబ్లీ నిర్వహణ తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంతో శాసనసభ అధికారులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. జూన్ 11, 12 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్‌ చివరలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.

అదలావుంటే జూన్‌ 3వ తేదీ నుంచి 6వ తేదీవరకు ముఖ్యమంత్రి హోదాలో ఆయా శాఖల వారీగా అధికారులతో జగన్‌ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆయన సచివాలయానికి రానున్నట్లు సమాచారం. అందులోభాగంగా సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధమవుతోంది. ఇప్పటికే వైసీపీ సీనియర్‌ లీడర్ వైవీ సుబ్బారెడ్డి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

English summary
YSRCP Chief Jagan Mohan Reddy met with Governor Narasimhan in Vijayawada. Andhrapradesh New Cabinet expansion took place on june 7th. YCP Chief Jagan Mohan Reddy declared that date and officials made arrangements accordingly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X