అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ

|
Google Oneindia TeluguNews

ఏపీ మండలిలో ఆరు సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేశారు. అయితే సీనియర్లకు ఇవ్వకపోవడంతో ఆలక వహించారు. మండలిలో వైసీపీ సీట్లు పెరిగినా.. సీనియర్ల అసంతృప్తితో రగడ నెలకొంది. అయితే వారికి సీఎం వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో పదవీ ఇస్తామని చెప్పడంతో సద్దుమణిగట్టు విశ్వసనీయ సమాచారం.

ఆశ పెట్టుకుంది వీరే..

ఆశ పెట్టుకుంది వీరే..

ఎమ్మెల్సీ సీటు కోసం గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. జగన్ కూడా వీరికి హామీనిచ్చారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. రాజశేఖర్‌ను మండలికి పంపించి.. తన పక్కన కూర్చొబెట్టుకుంటామని చెప్పారు జగన్. గుంటూ రు జిల్లా నుంచి జంగా కృష్ణామూర్తికి ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు కూడా పదవీ అందజేశారు.

జిల్లాలవారీగా..

జిల్లాలవారీగా..

పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే షఏక్ ముజు‌బుల్ రహమాన్‌కు పదవీ ఇస్తామని చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులుకు ఇస్తానని జగన్ ప్రకటించారు. 2019లోనే తోట వాణిని కూడా మండలికి పంపిస్తామని తెలియజేశారు. అమలాపురం నేత కుడిపూడి చిట్టాబ్బాయ్‌కు కూడా అదే పరిస్థితి. వీరందరీ పేర్లను జగన్ ప్రకటించారు. మొత్తంగా 30 మంది పేర్లను ప్రకటించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదవీ ఇవ్వడం వీలు కాలేదు. దీంతో చాలామంది గుర్రుమీదున్నారు.

వీరికే ఎందుకంటే

వీరికే ఎందుకంటే

జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన సీ రామచంద్రయ్య సీనియర్ నేత.. ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. మండలిలో విపక్ష నేతగా కూడా వ్యవహరించారు. వివిధ అంశాలపై ఆయనకు అవగాహన ఉంది. ఆర్థికరంగంపై ఆపార అవగాహన ఉంది. పార్టీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా ఆర్థిక అంశాలపై అవగాహన ఉంది. సభలో టీడీపీని ఎదుర్కొవడం, సమర్థవంతంగా వాదన వినిపించేందుకు రామచంద్రయ్యకు పదవీ ఇచ్చారని టాక్. టెక్కలిలో అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టేందుకు దువ్వాడ శ్రీనివాస్ పేరు ఎంపిక చేశారు.

సానుభూతి కోణం

సానుభూతి కోణం

హిందూపూర్‌లో చురుగ్గా పనిచేస్తోన్న మహ్మద్ ఇక్బాల్‌కు అవకాశం కల్పించారు. ఇతనికి చట్టపరమైన అంశాలపై ఐడియా ఉండటంతో పదవీ వరించింది. కరిమున్సీసాకు చోటు కల్పించడం.. మైనార్టీలను మెప్పించడం అని తెలుస్తోంది. తిరుపతి ఎంపీ దివంగత బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తిని, చనిపోయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానంలో ఆయన తనయుడు చల్లా భగీరథ రెడ్డిని సానుభూతి కోణంలో ఎంపిక చేశారు.

ఇదీ లెక్క

ఇదీ లెక్క


ఏపీ మండలిలో 58 సీట్లు ఉన్నాయి. టీడీపీకి 26 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 8 మంది ఉన్నారు. నామినేటెడ్ 8 మంది.. పీడీఎఫ్ 5, బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఆరుగురితో వైసీపీ బలం 14కి పెరగనుంది.

English summary
ycp seniors are unhappy to not nominate to andhra pradesh mandali. almost 30 leaders are waiting for posts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X