అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో వైసీపి అనూహ్య వ్యూహం..! అందుకే ఆ నేత‌ల‌కు గాలం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఏపి లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ప్ర‌ధానంగా ఉన్న‌ది రెండు పార్టీలే ఐన‌ప్ప‌టికి వాటి మ‌ద్య తీవ్ర పోటీ నెల‌కొంది. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెలుపు ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న అదికార టీడిపి, ప్ర‌తిప‌క్ష వైసీపి పార్టీలు త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితుల‌ను మార్చుకుంనేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అందులో భాగంగా పార్టీ బ‌లోపేతం పై ద్రుష్టి కేంద్రీక‌రించ‌డ‌మే కాకుండా ఆయా పార్టీల‌లోని బ‌ల‌మైన నేత‌ల‌ను త‌మ‌వైపుతిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష వైసీపి ఓ అడుగు ముందుకేసి టీడిపి కి సానుబూతిగా ఉంటున్న స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేల ప‌ట్ల ఓక‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది.

టీడిపి నేత‌లకు వైసిపి గాలం..! ఏపి లో పోటాపోటీ రాజ‌కీయాలు..!

టీడిపి నేత‌లకు వైసిపి గాలం..! ఏపి లో పోటాపోటీ రాజ‌కీయాలు..!

ముందు అలాంటి నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకుని టికెట్ ఖరారు చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని వైసీపి అదిష్టానం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ ఈ సారి అభ్య‌ర్తుల‌ను ముంద‌స్తుగానే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఆ పార్టీ త‌రుపున టికెట్ ఆశించి బండ‌ప‌డ్డ నేత‌ల‌ను కూడా త‌మ పార్టీలో చేర్చ‌కుని ఫ‌లితం పొందాల‌ని వైసిపి ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. అందుకోసం టీడిపి లో త‌ట‌స్తంగా ఉన్న నేత‌ల‌తో తో పాటు రెబ‌ల్ అభ్య‌ర్ధుల ప‌ట్ల ఇప్ప‌టినుండే వైసీపి ఓకన్నేసి పెట్టిన‌ట్టు స‌మాచారం.

బాబు మాటను కాదంటున్న ఆ ఎమ్మెల్యే.! పార్టీ మారేందుకే సుముఖ‌త‌..!! బాబు మాటను కాదంటున్న ఆ ఎమ్మెల్యే.! పార్టీ మారేందుకే సుముఖ‌త‌..!!

సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా క‌దుపుతున్న పావులు..! ఎవ‌రిది పేచేయో..!

సాధార‌ణ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా క‌దుపుతున్న పావులు..! ఎవ‌రిది పేచేయో..!

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి ఎత్తుగడల్లో వారు నిమగ్నమయ్యారు. ఏపిలో చంద్ర‌బాబు ఇమేజికి డామేజి క‌ల్పించాల‌ని వైసీపి ఇప్ప‌టినుండే వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలువకుంటే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు అంత ఆశాజ‌న‌కంగా ఉండదని వైసీపి భావిప‌స్తోంది. అందులో భాగంగా వైసీపీ, అధికార పార్టీపై అనేక ఆరోప‌ణ‌ల‌ను గుప్పిస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌లు. అదికార పార్టీని దెబ్బ‌తీయాల‌నే వ్యూహంలో భాగంగా ప్రజల్లో మంచి పేరున్న నేతలకు ఆశ చూపించి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.

త‌ట‌స్తంగా ఉన్న టీడిపి నేత‌ల‌కు వైసీపి ఆహ్వానం..! వేచి చూసే ధోర‌ణిలో నాయ‌కులు..!!

త‌ట‌స్తంగా ఉన్న టీడిపి నేత‌ల‌కు వైసీపి ఆహ్వానం..! వేచి చూసే ధోర‌ణిలో నాయ‌కులు..!!

ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ని వైసీపీ లోకి లాగటానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపి. ఆమంచి.. పోయినసారి ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవటంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అది ఆయనకు రెండో గెలుపు. రాబోయే 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హాట్రిక్ కొట్టేయాలనే ఆత్రుత‌తో ఉన్నారు ఆమంచి. ఆ మేరకు ఆమంచికి ప్రజామద్దతు కూడా మెండుగా ఉంది. ఆమంచిని తన పార్టీలోకి చేర్చుకోవడానికి వైసీపి రాయబారాలు చేస్తున్నట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే పలు రాయబారాలు పంపినా ఆమంచి మాత్రం వైసీపీలో చేరేందుకు సుముఖంగా లేరని కూడా తెలుస్తోంది.

ఆమంచి క్రిష్ణ మోహ‌న్ కు బంప‌ర్ ఆఫ‌ర్..! ఏటూ తేల్చుకోని ఆమంచి..!

ఆమంచి క్రిష్ణ మోహ‌న్ కు బంప‌ర్ ఆఫ‌ర్..! ఏటూ తేల్చుకోని ఆమంచి..!

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని మరో బంపర్‌ ఆఫర్‌‌తో ఆమంచిని స్వాగ‌తించేందుకు వైసీపి ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అయినా కూడా ఆమంచి మాత్రం ససేమిరా అంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో టీడీపీదే మరోసారి అధికారం అనే నమ్మకంతో ఆమంచి.. టీడీపీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌స్తే టీడీపీ నుంచి లేదంటే ఇండిపెండెంట్‌గానే చేస్తాన‌ని ఆమంచి తేల్చి చెప్తుండ‌డం విశేషం. రానున్న రోజుల‌క‌లో ఏ పార్టీ పాచిక ఎలా వ‌ర్కౌట్ అవుతుందో చెప్ప‌డం మాత్రం క‌ఫ్టంగా మారింది.

English summary
Besides concentrating on strengthening the party, the two parties are making efforts to address strong leaders of the parties.Specifically, the Opposition YCP seems to have taken a step ahead of the Independent MLAs, to join in ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X