అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊసరవెల్లి కన్నా వేగంగా : మీ బావమరిది శవం పక్కనే కేటీఆర్‌తో పొత్తు గురించి : జ‌గ‌న్ ధ్వ‌జం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ వ్యాఖ్య‌ల పై చంద్ర‌బాబు రియాక్ష‌న్ ను వైసిపి అధినేత జ‌గ‌న్ త‌ప్పు బ‌ట్టారు. సీయం చంద్ర‌బాబు త‌న బావ‌మ‌రిది భౌతిక కాయం ప‌క్క‌నే కేటీఆర్ తో పొత్తు గురించి మాట్లాడిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేస్తు న్నారు. నాడు పొత్తు కోసం వెంపర్లాడి..నేడు చెబుతున్న మాట‌లేంట‌ని ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఊస‌ర‌వెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు..

ప్ర‌త్యేక హోదాను టిఆర్‌య‌స్ వ్య‌తిరేకిస్తే మరి ఆ పార్టీతో పొత్తుకు ఎందుకు ఉత్రూత‌లూగావ్ అంటూ టిడిపి అధినేత చంద్ర‌బాబు ను వైసిపి అధినేత జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. హ‌రికృష్ణ భౌతిక కాయం ప‌క్క‌నే పొత్తు గురించి ఎందుకు బేర‌సారా లు ఆడావ‌ని నిల‌దీసారు. ఊస‌ర‌వెల్లి క‌న్నా వేగంగా రంగులూ మారుస్తూ త‌మ‌ను విమర్శిచ‌టం ఏంటంటూ సీయం ఐ జ‌గ‌న్ ఫైర్ అయ్యారు.

Ys Jagan slams Chandra Babu on his Political steps..

చంద్ర‌బాబు జాతీయ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు చాల‌క‌..అంత‌రిక్ష రాజ‌కీయాలు చేస్తారా అని ఎద్దేవా చేసారు. చంద్ర‌బాబు లంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందు ఒక మాట, ఆ ఎన్నికల్లో బోర్లా పడ్డ తర్వాత మరో మాట మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నాడని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టు 29న హైదరాబాద్‌లో చంద్రబాబు బావమరిది హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతుండగా, ఆయన భౌతికకాయం పక్కనుండగానే కేటీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడాడు. దానికి కేటీఆర్‌ ససేమిరా అన్నాక రెండు నెలలు తిరగకుండానే ఢిల్లీకి వెళ్లాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నార‌ని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కెసిఆర్‌..అస‌ద్ ఇద్ద‌రూ చంద్ర‌బాబు ల‌క్ష్యంగా ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటామ‌ని చెబుతూ వ‌స్తున్నారు. దీని పై టిడిపి నేత‌లు ఏపిలో వైసిపిని టార్గెట్ చేస్తున్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా ను అడ్డుకున్న కెసిఆర్ తో జ‌గ‌న్ ఎలా పొత్తు పెట్ట‌కుంట‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో అస‌ద్ వ్యాఖ్య‌ల మీద ర‌గ‌డ మొద‌లైంది. ఇప్పుడు జ‌గ‌న్ నేరుగా చంద్ర‌బాబు ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌టం తో టిడిపి నుండి ఎటువంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి..

English summary
YCP Chief Jagan slams C.M Chandra Babu on his politics. jagan alleged that Chandra babu no ethics in politics..and also cornered on alliance with conress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X