అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు: పోలీసులతో దురుసు ప్రవర్తనే కారణం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులను అసభ్యపదజాలంతో దూషించారని, విధులకు ఆటంకం కలిగించారిన పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.

యువ తార సందీప ధార్ బ్యూటిఫుల్ ఫోటోలు..

Recommended Video

అనంతపురం: జేసీ దివాక‌ర్‌రెడ్డిపై మ‌రో కేసు : ఈ సారి పోలీసులే ఫిర్యాదు చేశారు..!

తాడిపత్రి పట్టణంలో డిసెంబర్ 24న టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పెద్దారెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులపైన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

A police case filed on TDP leader JC Diwakar reddy.

ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. కాగా, పెద్దారెడ్డి, ఆయన కుమారులపై తాము ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా నమోదు చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టేందుకు పిలుపునిచ్చారు.

శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో నిర్బంధించగా, పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలోని ఫామ్ హౌస్‌ లో ఉన్న దివాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

కాగా, ఈ సందర్భంగా తన ఇంట్లోకి వచ్చిన పోలీసులపై మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, దివాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. అసభ్య పదజాలంతో దూషించారని పోలీసు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో దివాకర్ రెడ్డిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ వెల్లడించారు.

English summary
A police case filed on TDP leader JC Diwakar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X