అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘విక్రమార్కుడు’ సీన్: అందరూ చూస్తుండగా వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్, ఎస్పీకి భర్త ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లా కదిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత వెంటపడుతున్న రౌడీషీటర్ ఆమెను అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

సంతోషంగా సాగుతున్న కాపురంలోకి రౌడీషీటర్

సంతోషంగా సాగుతున్న కాపురంలోకి రౌడీషీటర్

వివరాల్లోకి వెళితే.. పులివెందులకు చెందిన మెహబూబ్ బాషాకు కదిరి చెందిన భానుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వృత్తిరీత్యా వారు కదిరిలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి కాపురం సంతోషంగా సాగుతున్న సమయంలో కదిరికి చెందిన అహ్మద్ అనే రౌడీషీటర్ ప్రవేశించాడు.

వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్

వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్


భాను వెంటపడుతూ ఆమెను తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డాడు. అంతేగాక, ఆమెను జనవరి 10న బలవంతంగా అపహరించుకుపోయాడు. విషయం తెలుసుకున్న బాషా రౌడీషీటర్ ఇంటికి వెళ్లాడు. తన భార్యను విడిచి పెట్టాలని కోరాడు. అయితే, ఆ రౌడీషీటర్.. తన వద్ద భాను లేదని, మరోసారి వస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడని భాను భర్త మెహబూబ్ మీడియాకు తెలిపాడు.

పట్టించుకోని స్థానిక పోలీసులు

పట్టించుకోని స్థానిక పోలీసులు


ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మెహబూబ్ చెప్పాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించామని చెప్పాడు. తన భార్యను తన వద్దకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపాడు.

అమ్మ కావాలంటూ పిల్లలు..

అమ్మ కావాలంటూ పిల్లలు..


తన పిల్లలు అమ్మ కావాలంటూ ఏడుస్తున్నారని మెహబూబ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని.. నువ్వేం చేస్తావంటూ సదరు రౌడీ షీటర్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. జిల్లా ఎస్పీని తమకు న్యాయం చేయాలని కోరినట్లు మెహబూబ్ తెలిపాడు.

English summary
A rowdy sheeter kidnapped a married woman in kadiri in anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X