అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురం జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు-ఈనెల 24 ఢిల్లీలో అందుకోనున్న కలెక్టర్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు ఎన్నో ప్రత్యేకతలను చాటుతూ ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఈ జిల్లా తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ రంగంలో జిల్లా హార్టీకల్చర్ శాఖ చేసిన కృషికిగాను స్కోచ్ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం అమలు చేయడంలో అనంతపురం ముందువరసలో నిలిచి మరోసారి కేంద్రం దృష్టిని ఆకట్టుకుంది. కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలు చొప్పున రైతులకు నేరుగా నగదును తమ ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. ఈ నగదు బదిలీ పథకంలో భాగంగా అర్హులైన రైతులను గుర్తించి వారికి ఫలాలను అందజేయడంలో జిల్లా యంత్రాంగం చూపిన చొరవను కేంద్రం కొనియాడుతూ అనంత జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డును ప్రకటించింది.

కేంద్రం పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డును ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన పథకం ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో ఏ మేరకు అమలవుతోందనే విషయంపై పరిశీలించగా... అనంతపురం తొలి వరసలో నిలిచింది. 99.60శాతం మంది రైతులకు ఈ పథకం అందుతోంది. మొత్తం ఈ పథకానికి 28,505 మంది రైతులు అర్హులు కాగా వారిలో 99.60శాతం మంది రైతులకు నగదు వారి ఖాతాలో జమ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని కేంద్రం గుర్తిస్తూ అనంతపురంకు జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటిస్తూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి ఆహ్వానం పంపింది. ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. కలెక్టర్‌తో పాటు పలువురు వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమంకు హాజరు కానున్నారు.

Anantapur bags prestegious PM kisan award, Here is why?

ఇక ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లా పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది కనిపిస్తోంది. కరోనా కాలంలో కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాదు పలు రాష్ట్రాలు కూడా ఆ నిర్ణయాలను అమలు చేశాయి. ఇక అనంతపురంలో ఆయా కాలనీలకు కులాల ఆధారిత పేర్లు ఉండకూడదని.. కాలనీలకు తమకు నచ్చిన మహానుభావుల పేర్లను పెట్టుకోవచ్చని పేర్కొంటూ కలెక్టర్ గంధం చంద్రుడు అమలు చేసిన సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు పక్క రాష్ట్రాలు కూడా ఈ తరహా ఆలోచనను అమలు చేశాయి. అంతకుముందు కరోనా కాలంలో అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలును ప్రారంభించి సక్సెస్ కావడంతో ఈ జిల్లా పేరు అప్పట్లో మారుమోగిపోయింది.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా ఇటు అభివృద్ధిలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో ముందు వరసలో ఉందనే చెప్పాలి. అనంతపురం పలు రంగాల్లో దూసుకెళుతుండటంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు... ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

English summary
Anantapur had once again made news for bagging the PM Kisan award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X