అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...

|
Google Oneindia TeluguNews

అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది కాదు. కానీ ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రైవేటుకు కూడా అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా దోపిడీ కూడా మొదలైంది. అవసరం ఉన్నా లేకున్నా కోవిడ్‌ పరీక్షల పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం పెరిగిపోయింది. ఇదే కోవలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో కరోనా పరీక్షల పేరుతో జరుగుతున్న దోపిడీపై అధికారులు దృష్టిపెట్టారు.

అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశాలతో నిర్వహించిన దాడుల్లో రెండు డయాగ్నస్టిక్‌ సెంటర్లు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తేలింది. అనంతపురం పట్టణంలోని స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సీజ్ చేశారు.

anatapur officials seize two diagnostic centres for violating covid 19 test norms

స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి వైద్యాధికారుల సిఫారసు లేకున్నా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తీస్తున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు డీఎంహెచ్ ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, అదనపు డిఎమ్ హెచ్ఓ డాక్టర్ రామసుబ్బారావు స్టార్ డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ, సిటి స్కాన్ లకు ప్రజల నుండి నిర్దేశిత మొత్తాల కన్నా అధికంగా స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

anatapur officials seize two diagnostic centres for violating covid 19 test norms

Recommended Video

AP Cabinet Key Decisions బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ! || Oneindia Telugu

అనంతపురంలోని కొన్ని డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో రెఫరల్ లేకున్నా పరీక్షలు చేస్తున్నట్లు, అవకతవకలు జరుగుతున్నట్లు తేలింద కలెక్టర్‌ తెలిపారు. నగరంలో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న రెండు డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్ ను మూసివేస్తున్నామని, .మిగిలినవాటికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామన్నారు.

English summary
anantapur district officials on saturday seized two private diagnostic centres for violating covid 19 testing norms and do unnecessary tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X