అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ బద్రర్స్‌కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ సర్కారు మరో షాకిచ్చింది. అక్రమంగా తిప్పుతున్న జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించింది.

అక్రమ రిజిస్ట్రేషన్..

అక్రమ రిజిస్ట్రేషన్..

జేసీ ట్రావెల్స్‌కు చెందిన 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. జటాధర ఇండస్ట్రీస్ పేరు మీద 50 వాహనాలు, సి గోపాల్ రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు.

ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణలో.. కేంద్రానికి ఫిర్యాదు

ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణలో.. కేంద్రానికి ఫిర్యాదు

అంతేగాక, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. వీటికి సంబంధించి అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని ప్రసాదరావు తెలిపారు. డేటా బేస్‌లో ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ తిరుగుతున్నా.. ఈ వాహనాలను సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జాయింట్ కమిషనర్ తెలిపారు.

ఇప్పటికే దాదాపు 100 వాహనాల వరకు రిజిస్ట్రేషన్ రద్దు..

ఇప్పటికే దాదాపు 100 వాహనాల వరకు రిజిస్ట్రేషన్ రద్దు..

ఇన్స్యురెన్స్ కంపెనీలను కూడా నేషనల్ డేటాబేస్‌లో అప్ డేట్ చేయాలని కోరినట్లు ప్రసాదరావు వెల్లడించారు. అప్పటికే అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులున్నాయని, దీంతో రిజిస్ట్రేషన్ రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు జేసీ ట్రావెల్స్‌కు చెందిన 62 వాహనాలను సీజ్ చేశామని, 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందని అన్నారు.

నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీలు... హెచ్చరించినా..

నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీలు... హెచ్చరించినా..


తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలుచేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని తెలిపారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్ రెడ్డి, జటాధర ఇండస్ట్రీస్ కు డైరెక్టర్లుగా ఉన్నారని ప్రసాదరావు వెల్లడించారు. ఇప్పటికే ఫోర్జరీ కేసు, ట్రావెల్ బస్సులకు ఇన్స్యూరెన్స్ అంశాలు జేసీ మెడకు చుట్టుకోగా, తాజాగా ఈ పరిణామం జేసీ బ్రదర్స్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగనట్లు తెలుస్తోంది.

English summary
AP govt complainted to centre on jc travels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X