అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీని వెంటాడుతున్న కష్టాలు: కొడుకు, కోడలుకు హైకోర్టు నోటీసులు, 2011 నాటిది..

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటీకే ఆర్టీఏ అధికారులు ఆయనకు చెందిన ట్రావెల్స్ బస్సులను సీజ్ సీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

జేసీ కొడుకు కోడలికి నోటీసులు

జేసీ కొడుకు కోడలికి నోటీసులు

ఈ క్రమంలో మరో తలనొప్పి ఎదురైంది జేసీకి. హైకోర్టులో త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు మంజూరుకు సంబందించిన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై జేసీ దివాకర్ రెడ్డి కుటుంబసభ్యులకు హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
ప్రతివాదులుగా పేర్కొంటూ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు, కోడలికి నోటీసులు జారీ చేసింది.

2011లో పిటిషన్..

2011లో పిటిషన్..

లైమ్ స్టోన్ గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
కాగా, త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్ స్టోన్ గనులు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని తాడిపత్రికి చెందిన
మురళీప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. జేసీ దివాకర్ రెడ్డి సహా త్రిశూల్ సంస్థ భాగస్వాములకు సెప్టెంబర్‌లో నోటీసులు పంపింది.

వరుస షాక్‌లు...

వరుస షాక్‌లు...

ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కొడుకు, కోడలికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. జేసీ కుటుంబానికి ఇటీవల కాలంలో ఇలా వరుస షాక్‌లు తగులుతుండటం గమనార్హం. ఇప్పటికే రెండుసార్లు ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 50 బస్సుల్ని సీజ్ చేశారు. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్ల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులకు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు.

అందుకేనేమో..

అందుకేనేమో..

దీంతో జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తమను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో తమకు దశాబ్ధాల అనుభవం ఉందని, తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో తమపై ఒత్తిడి పెంచుతున్నారని, అధికార పార్టీలోకి చేరితే ఇలాంటివేవి ఉండవని అంటున్నారని ఆరోపించారు జేసీ.

English summary
ap high court issued notice to jc diwakar reddy's son and daughter-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X