అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Jagan: విస్తరణకు అవకాశం ఇస్తాం: పెట్టుబడులు పెట్టండి: కియా మోటార్స్ ప్లాంట్ లో వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెనుక బడిన జిల్లాల్లో పెట్టుబడులును పెట్టడానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. కియా మోటార్స్ విస్తరణ పనులను చేపట్టాలని, దీనికోసం అనుమతులు ఇస్తామని ఆయన సంస్థ యాజమాన్యానికి సూచించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 18 వేల మందికి కియా మోటార్స్ సంస్థ ఉపాధిని కల్పిస్తుండటం హర్షణీయమని అన్నారు.

YS Jagan: కేస్ స్టడీగా జగన్ అవినీతి: తండ్రి అధికారం..43 వేల కోట్లు పోగు: ఐఐఎం-అహ్మదాబాద్ కు టీడీపీ..YS Jagan: కేస్ స్టడీగా జగన్ అవినీతి: తండ్రి అధికారం..43 వేల కోట్లు పోగు: ఐఐఎం-అహ్మదాబాద్ కు టీడీపీ..

తొలిసారిగా కియా మోటార్స్ కు..

అనంతపురం జిల్లాలోని పెనుకొండ సమీపంలో జాతీయ రహదారికి సమీపంలో నిర్మించిన కియా మోటార్స్ కార్ల తయారీ ప్లాంట్ ను గురువారం ఆయన సందర్శించారు. కియా మోటార్స్ ను వైఎస్ జగన్ సందర్శించడం ఇదే తొలిసారి. ఇదివరకు కియా కార్లను మార్కెట్ లోకి విడుదల చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉండగా.. ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల అది రద్దయింది. ఆ తరువాత.. కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. కొన్ని విభాగాలను ఆయన ప్రారంభించారు.

అనంతపురం జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు గొప్ప విషయం..

అనంతపురం జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు గొప్ప విషయం..


ప్లాంట్ లోని అన్ని విభాగాలను పరిశీలించారు. కార్ల తయారీతో ముడిపడిన యూనిట్లలో జగన్ కలియ తిరిగారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్లాంట్ ను నెలకొల్పాలని కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. సంస్థ విస్తరణ పనులను చేపట్టాలని, దీనికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో జారీ చేస్తామని చెప్పారు.

విస్తరించండి.. అనుమతులు ఇస్తాం..

విస్తరించండి.. అనుమతులు ఇస్తాం..

రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రత్యేకించి- వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులను పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమలను నెలకొల్పడానికి అవసరమైన రోడ్లు, విద్యుత్, రవాణా.. వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో వెనుకంజ వేయబోమని అన్నారు. పారిశ్రామిక రంగం బలంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం ఇప్పటికే 18 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోందని, సంస్థను విస్తరించడం ద్వారా మరిన్ని వేలమందికి ఉపాధి లభిస్తుందని వైఎస్ జగన్ చెప్పారు.

స్వాగతం పలికిన జిల్లా ఎమ్మెల్యేలు..

అంతకుముందు- విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్.. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే, మంత్రి శంకర నారాయణ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఎమ్మెల్యేలు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కియా మోటార్స్ సంస్థ ప్లాంట్ కు చేరుకున్నారు. భారత్ లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయం అధికారులు, కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy visits Kia Motors plant in Anantapur district on the Thursday. He was participated in the Grand Opening Ceremony of Kia Motors Company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X