అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్‌లకు షాక్... బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను అనంతపురం కోర్టు తిరస్కరించింది. ఇద్దరిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. వీరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి.జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఆన్‌లైన్‌లో బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం(జూన్ 18) న్యాయమూర్తి వీరిని ఆన్‌లైన్‌లోనే విచారించారు. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఇద్దరికి నిరాశ తప్పలేదు.

దివాకర్ ట్రావెల్స్‌లో అక్రమాలు...

దివాకర్ ట్రావెల్స్‌లో అక్రమాలు...

అశోక్ లే లాండ్ నుంచి తుక్కు కింద బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేసి తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఆ వాహనాలను నాగాలాండ్‌‌లోని కొహిమా,ఏపీలోని అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అలాగే 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లు సమర్పించినట్టు విచారణలో తేలింది. ఫోర్జరీ కేసులో గత శనివారం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల్ని హైదరాబాద్‌లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని అనంతపురం తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. మొదట అనంతపురం జైలుకు తరలించాలని భావించినప్పటికీ.. అక్కడ కరోనా భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు.

భయపడే వ్యక్తిని కాదన్న జేసీ దివాకర్ రెడ్డి..

భయపడే వ్యక్తిని కాదన్న జేసీ దివాకర్ రెడ్డి..


అంతకుముందు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం తమను అక్రమ కేసులతో వేధిస్తోందని,వ్యాపారాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. అయితే అవేవీ తనను భయపెట్టలేవని.. వ్యాపారాలు పోయినా తాను నష్టపోనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తమ బస్సులను,లారీలను తిరగనివ్వకుండా చేశారని మండిపడ్డారు.

Recommended Video

YS Jagan ఫోటో పెట్టుకుని మళ్లీ గెలవండి రా చూస్తాను - Raghu Rama Krishnam Raju
వైసీపీకి లొంగేది లేదని..

వైసీపీకి లొంగేది లేదని..

తనకు పొలం ఉందని.. వ్యాపారాలు పోయినా.. పంట సాగు చేసుకుంటూ బతకగలనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అంతే తప్ప వైసీపీ బెదిరింపులకు లొంగేది లేదన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత నవరత్నాల అమలును కొనసాగించలేరన్న జేసీ.. ఒకవేళ కొనసాగించాలంటే ప్రభుత్వ భూములను అమ్మక తప్పదన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని పరిపాలించడం ఎన్నో రోజుల సాధ్యపడదన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాభివృద్ది కోసం సీఎం జగన్ ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. మున్ముందు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వరని అన్నారు.

English summary
Anantapuram court dismissed bail petition of JC Prabhakar Reddy and his son JC Asmith Reddy and given them into police custody for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X