అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోరంట్ల మాధ‌వ్‌.. మ‌ళ్లీ మీసం మెలేశారు! పోలీస్ కాదు ఇప్పుడు ఎంపీ

|
Google Oneindia TeluguNews

అనంత‌పురం: గోరంట్ల మాధ‌వ్‌. రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఓ కెర‌టం. ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఎంత సంచ‌ల‌నం రేపింది.. ఆయ‌న సాధించిన విజ‌యం కూడా అంతే సంచ‌ల‌నాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టారాయ‌న‌. హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గోరంట్ల మాధ‌వ్‌.. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేయబోతున్నారు. తెలుగుదేశం సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌ను మ‌ట్టి క‌రిపించబోతున్నారు. ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. గెలుపు రుచి చూడ‌బోతున్నారు.

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

నిజానికి ఆయ‌న సీఐగా ప‌నిచేశారు. వెనుక‌బ‌డిన కురుబ కులానికి చెందిన వ్య‌క్తి. అనంత‌పురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో- త్రైత‌సిద్ధాంతం ఆశ్ర‌మం విష‌యంలో అనంత‌పురం లోక్‌స‌భ మాజీ స‌భ్యుడు, జేసీ దివాక‌ర్ రెడ్డి, పోలీసుల వివాదాలు చెల‌రేగాయి. అప్ప‌ట్లో జేసీ దివాక‌ర్ రెడ్డి జిల్లా పోలీసుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌భ్య ప‌ద‌జాలంతో వారిని దూషించారు.

 Former Cop Gorantla Madhav is all set to step in Lok Sabha

ఈ ఘ‌ట‌న గోరంట్ల మాధ‌వ్‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది. జేసీ దివాక‌ర్ రెడ్డి వంటి బ‌ల‌మైన రాజ‌కీయ నాయకుడిని ఎద‌రించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌ను దుర్భాష‌లాడితే నాలుక చీరేస్తానంటూ గోరంట్ల మాధ‌వ్ విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, మీసం మెలేసి మ‌రీ.. జేసీ దివాక‌ర్ రెడ్డిని హెచ్చ‌రించారు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా గోరంట్ల మాధ‌వ్ పేరు మారుమోగిపోయింది.

ఆ ఘ‌ట‌న‌తో వెలుగులోకి వ‌చ్చిన ఆయ‌న క్ర‌మంగా రాజ‌కీయాల వైపు మొగ్గు చూపారు. స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా ఆయ‌న‌కు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న‌కు హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇక్క‌డే జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. హిందూపురం లోక్‌స‌భ ప‌రిధిలో కురుబ‌ల ఓటుబ్యాంకు అధికంగా ఉంది. దీనికి అనుగుణంగా- వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌చారం చేయ‌డం క‌లిసి వ‌చ్చింది. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గోరంట్ల మాధ‌వ్‌.. హిందూపురం లోక్‌స‌భ ప‌రిధిలో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లిన గోరంట్ల మాధ‌వ్‌ను అక్క‌డ విధుల్లో ఉన్న డీఎస్పీ స్థాయి అధికారి సెల్యూట్ చేశారు. దీనికి ప్ర‌తిగా- మాధ‌వ్ కూడా ఆప్యాయంగా సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ పిక్‌.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

English summary
Former Cop Gorantla Madhav is all set to step in Lok Sabha. He is getting huge lead in Hindupur Lok Sabha Constituency. Gorantla Madhav contest in this Lok Sabha Elections from Hindupur constituency as YSR Congress Party Candidate. Now, He get huge lead against his opponent and TDP Candidate Nimmala Kistappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X