పార్టీ మారాలని ఒత్తిడి... అందుకే బస్సుల సీజ్ .... జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వ్యవస్థ అంతా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని సినియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా జగన్‌కు తెలిసి జరుగుతుందా లేదా అనేది ప్రజలే నిర్ణయించాలని అన్నారు. కొంతమందిని లొంగదీసుకునేందుకు ఆర్ధికంగా, మానసికంగా దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై కక్షసాధించేందుకే బస్సులు సీజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్

మైనింగ్ మూసివేతకు ఉత్తర్వులు సిద్దం
ఇక ఇప్పటి వరకు జేసీ ట్రావేల్స్‌కు చెందిన మొత్తం ఎనబై బస్సులు సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న కారణాలను చూపి కక్షసాధింపుతోనే బస్సులను సీజ్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బస్సులు సమయానికి రాలేదని కూడ కేసులు పెడుతున్నారని అన్నారు. ఇలా ఇప్పటికే 80 బస్సులకు వరకు సీజ్ చేశారని ఆయన తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా 15 బస్సులను ఇంకా అధికారులు తమ ఆదీనంలోనే పెట్టుకున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే పర్మిట్ లేని ఒక్క బస్సునైనా చూపిస్తారా అంటూ అధికారులకు సవాల్ విసిరారు. బస్సుల సీజ్‌కు సంబంధించి సంబధిత ఆర్టీఏ అధికారులపై కేసులు నమోదు చేస్తానని చెప్పారు. ఇక మరో రెండు రోజుల్లో తనమైనింగ్ మూసివేతకు కూడ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్దమవుతున్నారని జేసి చెప్పారు.

పార్టీ మారాలని ఒత్తిడి
ఈ నేపథ్యంలోనే తనను పార్టీ మారాలని ఓ పెద్దమనిషి చెప్పారని .. అప్పుడు ఎలాంటీ కేసులు ఉండవుకదా... అంటూ వ్యాఖ్యానించారని చెప్పారు. అయితే రాజకీయంగా తనకు ఎలాంటీ పదవులు లేకపోయినా ఉండగలననని జేసీ చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటీ బాదరా బందీ లేవని స్పష్టం చేశారు. తాన భార్యతోపాటు తాను కూడ ఓ చెట్టుకింద నులక మంచం వేసుకుని జీవించగలనని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వానికి లోంగిపోకపోకపోతే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు. అయినా తనకు ఎలాంటీ భయం లేదని అన్నారు. ఇక గతంలోనే తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు కూడ ప్రకటించాననని గుర్తు చేశారు.

తండ్రి జైలు వెళ్లాడు, నేను వెళతా...
జగన్ కంటే ముందే తన తండ్రి సుమారు అయిదేళ్ల పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో జైలుకు వెళ్లారని , తాను కూడ జైలుకు వెళ్లడానికి కూడ సిద్దమేనని అన్నారు. దీంతో తనపై ఎలాంటీ తప్పుడు కేసులు పెట్టినా పర్యాలేదని చెప్పారు. కాగా గత పదిహేను రోజులుగా జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ఆర్టీఏ అధికారులు దాడులు చేసి నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ ఆయన స్వంత జిల్లా అనంతపురంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి పలుబస్సులను సీజ్ చేశారు. మొత్తం ఎనబై బస్సులకు పలు అనుమతులు లేవని అధికారులు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!