అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల శ్రీరామ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన గోరంట్ల మాధవ్ .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగామారుతుంది. ప్రధాన పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక అన్ని జిల్లాలలోనూ అధికార , ప్రతిపక్ష పార్టీల నేతల ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఎన్నికల నేపధ్యంలో బెదిరింపులకు దిగుతున్నారని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే అనంతపురం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

Paritala Sriram: టీడీపీకి ఫ్యామిలీ షాక్ ఇస్తారా? ఏమన్నారంటే !! Paritala Sriram: టీడీపీకి ఫ్యామిలీ షాక్ ఇస్తారా? ఏమన్నారంటే !!

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో మొన్నటివరకు ఎంపీటీసి , జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఇక నామినేషన్లు దాఖలు చెయ్యకుండా బెదిరించటాలు, దౌర్జన్యం చెయ్యటం వంటి ఘటనల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారని ,అంతే కాక ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం సహించేది లేదని పేర్కొన్నారు .

Gorantla Madhav complained to the SP on Paritala Sriram .. Reason is

Recommended Video

AP Council Abolish : MLC Pothula Sunitha Challenges Nara Lokesh || Oneindia Telugu

రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఇక రామగిరిలో పరిటాల శ్రీరామ్ అరాచకాలు గమనించాలని ఆయన కోరారు. పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చెయ్యాలని పేర్కొన్నారు . ఇక గోరంట్ల మాధవ్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా పరిటాల శ్రీరామ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీవో కాలర్‌ని టీడీపీ నేతలు పట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే పరిటాల శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చెయ్యాలని వారు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

English summary
Recently, YCP MP Gorantla Madhav has made serious allegations against TDP leader Paritala Shriram . Shriram is threatening YCP candidates in the local elections and provoking the masses, he said. MP Gorantla Madhav accused him of intimidating their opponents by winning in Rapthadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X