అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యపై అనుచిత పోస్టులు: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి -తాడిపత్రిలో భయానక యుద్ధం

|
Google Oneindia TeluguNews

కొంతకాలంగా నివురుగప్పిన నీరులా ఉన్న అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య విభేధాలకు కేరాఫ్ గా ఉన్న తాడిపత్రి నియోజకవర్గంలో గురువారం అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీకి చెందిన జేసీ సోదరుల ఇంటిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరగణంతో దాడికి పాల్పడటం, ప్రతిగా జేసీ వర్గీయులు సైతం ఎదురుదాడికి సిద్ధం కావడంతో తాడిపత్రిలో చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

జేసీ ఇంటిపై పెద్దారెడ్డి దాడి..

జేసీ ఇంటిపై పెద్దారెడ్డి దాడి..

తాడిపత్రిలో టీడీపీ నేతలైన జేసీ సోదరులు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో విభేదాలు ముదరడంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురువారం.. నాలుగు వాహనాల్లో తన అనుచరులతో కలిసి జేసీ ఇంట్లోకి ప్రవేశించి వీరంగా సృష్టించినట్లు తెలుస్తోంది. జేసీ ఇంట్లోని వ్యక్తుల్ని గల్లా పట్టుకొని బయటికి లాక్కొచ్చిన ఎమ్మెల్యే.. ఎవడొస్తాడో రండిరా అని గేటు ముందు నిలబడి సవాళ్లు విసిరినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. దాడి జరిగిన సమయంలో..

కేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడుకేసీఆర్ ఇన్నింగ్స్ ముగింపు: 2021లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ -బెంగాల్ స్ట్రాటజీతో టీబీజేపీ దూకుడు

తప్పిన రక్తపాతం..

తప్పిన రక్తపాతం..

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో జేసీ ఇంటిపై దాడికి దిగిన సమయంలో ఆ ఇంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డిగానీ, జేసీ దివాకర్ రెడ్డిగానీ, ఆ కుటుంబానికి సంబంధించిన ఇతరులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. జేసీ కుటుంబ అనుచరుల్లో కీలక వ్యక్తులైన కిరణ్ సహా మరో వ్యక్తిపై ఎమ్మెల్యే దాడిచేసినట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి గురించి సమాచారం తెలిసిన వెంటనే..

తాడిపత్రిలో హైటెన్షన్..

తాడిపత్రిలో హైటెన్షన్..

వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి జేసీ ఇంటికి వచ్చారని తెలియగానే టీడీపీ వర్గీయులు పెద్ద సంఖ్యలో అటువైపు కదిలారు. ఈలోపే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగానే సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు ఉన్న తాడిపత్రిలో తాజా దాడి ఘటన హైటెన్షన్ రేపింది. అసలు..

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

భార్యపై అనుచిత పోస్టులే కారణమా?

భార్యపై అనుచిత పోస్టులే కారణమా?

ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ బ్రదర్స్ వర్గీయుల మధ్య చాలా కాలంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భార్యను ఉద్దేశించి అనుచిత, అసభ్యకరమైన, అవాస్తవాలతో కూడిన పోస్టులు పెట్టానని జేసీ వర్గంపై పెద్దారెడ్డి వర్గం గుర్రుగా ఉంది. పోస్టుల వ్యవహారం అంతకంతకూ పెద్దది కావడంతో అగ్రహం చెందిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

English summary
high tension erruprt in anantapur district tadipatri town on thrusday when tadipatri ysrcp mla Kethireddy Pedda Reddy allegedly attacks jc diwakar reddy's house. amid social media war between tdp and ysrcp leaders attack incident took place. both sides laurged complaints to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X