అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ బ్రదర్స్ కు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. ఫోర్జరీ కేసులో కీలక నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

జేసీ బ్రదర్స్ కు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడిన జేసీ ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తుంది సుప్రీం నిబంధలకు విరుద్ధంగా అక్రమంగా నిషేధిత వాహనాలను వినియోగించిన, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన జేసీ బ్రదర్స్ మెడకు ఉచ్చు బిగుస్తోంది . ఇక వారి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యటం , వాహనాలు సీజ్ చెయ్యటంతో పాటు దివాకర్ ట్రావెల్స్ లో ప్రయాణాలు చేస్తే వారికి ఇన్సూరెన్స్ కూడా వర్తించదని తేల్చి పారేశారు అధికారులు .

 76 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన అధికారులు

76 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన అధికారులు

2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్‌-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిస్తే , దీని ప్రకారం 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కిన జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాలో నిషేధిత వాహనాలను తెచ్చి వాటిని మార్చి విక్రయించారని పేర్కొన్నారు .జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు.

 60 బస్సులు సీజ్ .. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు

60 బస్సులు సీజ్ .. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు


బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్‌-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాదు 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇక దీంతో మరో 60 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఇక మిగతా వాహనాలను అజ్ఞాతంలో దాచి పెట్టిన జేసీ బ్రదర్స్ 94 వాహనాలను మాయం చేశారు . ఇక వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్టు అధికారులు గుర్తించారు.

Recommended Video

Posani Krishna Murali Helps TV5 Reporter Manoj Kumar Family
దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదన్న అధికారులు

దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదన్న అధికారులు

ఒకటి కాదు రెండు కాదు అన్నీ తప్పులే , అంతా ఫోర్జరీ మాయాజాలమే అని గుర్తించిన అధికారులు జేసీ బ్రదర్స్ కే కాదు దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణాలు చేసే వారికి షాకింగ్ విషయం చెప్పారు. దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఇన్సూరెన్స్ వర్తించదని పేర్కొన్నారు. స్క్రాప్ క్రింద కొనుగోలు చేసిన వాహనాలను ,లారీలను బస్సులుగా మార్చి తిప్పటం నేరమని పేర్కొన్నారు అధికారులు . ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జేసీ బ్రదర్స్ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన అధికారులు ఈ వ్యవహారంలో జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.

English summary
The AP government gave a major shock to the Jc Brothers. Jc Brothers Forgery case investigation is going on. The officials recently cancelled registration of their 76 buses, seized 60 buses and also said who travels in Divakar Travels would not get insurence if any accident occur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X