అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో ఉంటే లాభం లేదు ... వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై జేసీ

|
Google Oneindia TeluguNews

వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై అనంతపురం టిడిపి నేత, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ ఒక ఎమ్మెల్యే గా మాత్రమే తనకు తెలుసని, అతనితో పెద్ద పరిచయం కూడా లేదని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి పార్టీ మారే నేతలు ఎవరైనా ఇలా ఆరోపణలు చేస్తే వెళ్ళటం సహజమేనని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే లోకేష్ పై ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని పేర్కొన్నారు జెసి దివాకర్ రెడ్డి.

పప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీపప్పు వస్తాడా ... వాళ్ళ బాబు వస్తాడా ... చంద్రబాబు డబుల్ వెధవ : వల్లభనేని వంశీ

చాలామంది నాయకులు టిడిపిలో ఉంటే లాభం లేదనే భావనతో పార్టీ వీడి వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉంటే ఉపయోగం ఉంటుందన్న భావనతో చాలామంది పార్టీ మారే ఆలోచన చేస్తుంటారని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. జెసి దివాకర్ రెడ్డి సైతం పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న వేళ తనపై పార్టీ మారడానికి ఎలాంటి ఒత్తిడి లేదని, తమ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాగే తాజాగా తన మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడి చేయించారని పేర్కొన్నారు.

Recommended Video

Vallabhaneni Vamsi Mohan Fires Chandrababu Naidu About AP Sand Scarcity Issue
JC Diwakar Reddy comments on vallabhaneni vamsi issue


వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి తాను కలిసి తన సమస్యల గురించి చెప్పుకోవలసిన అవసరం లేదని, గతంలోనూ చేయలేదని, ఇకముందు చేయబోనని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ వ్యవహారం టిడిపిల దుమారం రేపుతుంది. టిడిపిలో ఉన్న నేతలందర్నీ వంశీ వ్యాఖ్యలు షాక్ కు గురి చేస్తున్నాయి.

English summary
TDP senior leader J C Diwakar Reddy said some of the party leaders are leaving the party announcing the reason of their choice. TDP senior leader said he does not know why Gannavaram MLA Vallabhaneni Vamshi has made harsh comments at party Chief Chandrababu Naidu and party national general secretary Nara Lokesh. Vamshi Speaking to a media channel, former TDP MP has alleged that some party leaders are quitting the party as they think that there is no use for them staying in the party. He has also reacted on the issues pertaining to seizure of his buses and ACB attack at his former PA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X