అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ అనుచరుడి హల్‌చల్, కిరోసిన్ పోసుకుని నిప్పు, 6 గంటలుగా రూరల్ పీఎస్‌లోనే మాజీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరు గంటల నుంచి పోలీసుస్టేషన్‌లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇవాళ ఉదయం పీఎస్‌కు వచ్చారు. బెయిల్ ప్రక్రియ పూర్తికాకపోవడం, జేసీ దివాకర్ రెడ్డి పోలీసుస్టేషన్‌లో ఉండటంతో హై టెన్షన్ నెలకొంది.

'పోలీసులతో బూట్లు నాకిస్తా’ వ్యాఖ్యల ఎఫెక్ట్: అనంతపురం రూరల్ పీఎస్‌కు జేసీ దివాకర్ రెడ్డి'పోలీసులతో బూట్లు నాకిస్తా’ వ్యాఖ్యల ఎఫెక్ట్: అనంతపురం రూరల్ పీఎస్‌కు జేసీ దివాకర్ రెడ్డి

టు బీ కంటిన్యూ..

టు బీ కంటిన్యూ..

జేసీ దివాకర్ రెడ్డి ముందస్తు బెయిల్ ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్పీ స్థాయి అధికారి బెయిల్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బెయిల్ కోసం జేసీ షూరిటీ ఇవ్వగా చెక్ చేసేందుకు పోలీసులు పుట్లూరు వెళ్లారు. దీంతో బెయిల్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. మరోవైపు తాడిపత్రి నుంచి జేసీ అనుచరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రూరల్ పీఎస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు టీడీపీ నేత పార్థసారథిని కూడా పోలీసులు పీఎస్ ముందు అడ్డుకున్నారు.

కిరోసిన్ పోసుకుని

కిరోసిన్ పోసుకుని

6 గంటల నుంచి జేసీ దివాకర్ రెడ్డి పీఎస్‌లో ఉండటంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక అనుచరుడు కిరోసిన్ పోసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ఈ నెల 18వ తేదీన పోలీసులతో బూట్లు నాకిస్తా అని జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ముందస్తు బెయిల్

ముందస్తు బెయిల్

జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. ఆ పత్రాలను పోలీసులకు ఇచ్చేందుకు వస్తే.. షూరిటీ పేరుతో కాలయాపన చేస్తున్నాని జేసీ అనుచరులు ఆరోపించారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

గతనెల 18వ తేదీన అనంతంపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని అన్నారు. పోలీసులను కించపరుస్తూ మాట్లాడారు. ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

English summary
jc diwakar reddy follower pour kerosene himself rural police station premises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X