అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలలేని రాజధాని..: సీమను యూటీ చేయాలంటూ జేసీ దివాకర్ రెడ్డి, బీజేపీలో మిత్రులంటూ..

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయం, ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా, ఆర్థికంగా కొంతమంది తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నడూ లేని విధంగా..

ఎన్నడూ లేని విధంగా..


గతంలో ఎన్నడూ లేనివిధంగా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీ సర్కారు పెద్దలపై పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీలో చాలా మంది మిత్రులు..

బీజేపీలో చాలా మంది మిత్రులు..

తనకు అధికారులపై ఎలాంటి కోపం లేదని.. కొందరి వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని జేసీ వ్యాఖ్యానించారు. బీజేపీలో తనకు చాలా మంది మిత్రులున్నారని అన్నారు. అనంతపురంకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు.

తలలేని రాజధానితో..

తలలేని రాజధానితో..

ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూడు రాజధానులపై స్పందిస్తూ.. తలలేని రాజధానితో ప్రజలు ఏం చేసుకుంటారని జేసీ ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని వైఎస్ జగన్ సర్కారుకు హితవు పలికారు.

రాయలసీమను యూటీ చేయాలి..

రాయలసీమను యూటీ చేయాలి..


ఒకవేళ రాజధాని మారిస్తే రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతం, గ్రేటర్ రాయలసీమ చేయాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై వారం రోజుల్లో పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తీసుకుంటామని జేసీ తెలిపారు. రాష్ట్రపతి గానీ, సుప్రీంకోర్టు గానీ మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోవాలన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు.

అలా చేస్తే బీజేపీలో చేరతానంటూ..

అలా చేస్తే బీజేపీలో చేరతానంటూ..


జేసీ దివాకర్ రెడ్డి ఇంతకుముందు బీజేపీలో చేరతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటే తాను బీజేపీలో చేరతానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ సహా దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రాంతీయ పార్టీలు ఉన్నంత కాలం తాను టీడీపీలో కొనసాగాల్సిందేనని అన్నారు.

English summary
TDP leader and former MP JC Diwakar Reddy sensational comments on capital city issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X