అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ దివాకర్ రెడ్డి నోట జమిలి మాట ... మోడీ పాట

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే అనంతపురం సీనియర్ టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలయిందని ఆయన పేర్కొన్నారు. అది ఎక్కువైనా కావొచ్చు, తక్కువైనా కావొచ్చన్నారు జేసీ దివాకర్ రెడ్డి . దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర పరోక్ష కారణం అని ఆయన పేర్కొన్నారు .

 ఏపీలో తెలంగాణా వాసులకు జగన్ పెద్దపీట .. కీలక పదవులు .. ఏపీలో తెలంగాణా వాసులకు జగన్ పెద్దపీట .. కీలక పదవులు ..

ఇక అంతేకాదు చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని జోస్యం చెప్పారు.ప్రస్తుతం దేశంలో నరేంద్రమోడీ హవా నడుస్తోందని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి అందుకే చాలా మంది నేతలు ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.చంద్రబాబు చేసిన తప్పులు, మోడీ సంక్షేమపథకాలే పార్టీ మార్పునకు కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

JC Diwakar reddy sensational comments on Modi and BJP

Recommended Video

వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న || TDP Leader Buddha Venkanna Fires On YSRCP Govt

దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనని పేర్కొన్న ఆయన జగన్ పాలనపై ఏడాది తర్వాత మాట్లాడుతానని మాట దాటవేశారు. ఒకప్పుడు ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కూడా జేసీ దివాకర్ రెడ్డి తాము హిట్లర్‌ను చూడలేదని కానీ మోడీ వ్యవహరశైలి అదే రకంగా ఉందన్నారు. ఇక ఇప్పుడు మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తుండటంతో ఆయన బీజేపీ బాట పడతారా .. మోడీ పాట పాడుతున్నారు అన్న చర్చ తాడిపత్రిలో జరుగుతోంది.

English summary
Regional parties have also relied on Prime Minister Modi's ideas. JC Diwakar Reddy said that Narendra Modi is ruling in the country and many leaders are now looking at the BJP.He made sensational remarks that Chandrababu's mistakes and Modi's welfare schemes were made the leaders the party's change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X