అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీ తండ్రీ కొడుకులకు ఊరట- మూడు అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో...

|
Google Oneindia TeluguNews

బీస్ 3 వాహనాలను బీఎస్ 4గా మారుస్తూ 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఊరట లభించింది. వీరిద్దరిపై దాఖలైన మూడు కేసుల్లో అనంతపురం జిల్లా న్యాయస్దానం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కడప జైల్లో రిమాండ్ లో ఉన్నారు.

జేసీ కేసులో ట్విస్ట్ ... పోలీసుల పీటీ వారెంట్ ... తండ్రీ తనయుల బెయిల్ యత్నాలు ఫలిస్తాయా ?జేసీ కేసులో ట్విస్ట్ ... పోలీసుల పీటీ వారెంట్ ... తండ్రీ తనయుల బెయిల్ యత్నాలు ఫలిస్తాయా ?

నకిలీ వాహనాల రిజిస్ట్ర్రేషన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరినీ జూన్ 13న అనంతపురం పోలీసులు హైదరాబాద్ లోని శంషాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చారు. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి రిమాండ్ లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్‌కు ప్రయత్నించినా దొరకలేదు. తాజాగా ఇవాళ అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వీరు రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

jc prabahakar reddy and his son asmith reddy gets bail in three fake registration cases

Recommended Video

#Vijayasripharma : విశాఖలో Vijayasri Pharma కంపెనీలో పేలుడు... ఎగసిపడ్డ మంటలు..! || Oneindia Telugu

నకిలీ వాహనాల రిజిస్ట్ర్రేషన్ చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి పై పోలీసులు అభియోగాలు మోపారు. వీటికి సంబంధించి పకడ్బందీ సాక్ష్యాలు కూడా సేకరించారు. వీటిపై విచారణ పలు దశల్లో ఉంది. దర్యాప్తు సుదీర్ఘంగా కొనసాగే అవకాశముండటం, ఇతర రాష్ట్రాల నుంచి సమాచారం వచ్చేందుకు సమయం పడుతుంటడం వల్ల అనంతపురం కోర్టు వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడుదలైతే తాజాగా ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన టీడీపీ నేతల్లో బెయిల్ పై బయటికి వచ్చిన ఘనత కూడా వీరికి దక్కనుంది. ఈఎస్ఐ స్కాంతో పాటు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇంకా బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారు.

English summary
anatapur sc, st court has granted bail to tdp leader jc prabhakar reddy and his son asmith reddy in fake registration of vehicles cases today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X