అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులసు మరోసారి అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలోని తనిఖీలు చేపట్టిన అధికారులు బస్సులను సీజ్ చేశారు. మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మరో 5 జేసీ ట్రావెల్స్ బస్సులను అధికారులు జేసీ స్వంత జిల్లా అనంతపురంలో సీజ్ చేశారు. ఇంటర్ స్టేట్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా పది రోజుల క్రితమే జేసీ ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే...

ముఖ్యంగా బస్సులు సరైన ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకుండా నడుపుతుండడంతో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అయిదు బస్సులతో కలిపి మొత్తం 36 సీజ్ చేయగా మరో 18 కాంట్రాక్టు బస్సులను కూడ అధికారులు సీజ్ చేశారు. అయితే ఇదివరకే జేసీ బస్సులను సీజ్ చేయడంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా తన ట్రావెల్ బస్సులపై దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Jc travels buses have been seized once again

తన రాజకీయ జీవీతంలో ఇలాంటీ సంఘటనలు ఎప్పుడు చూడలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పాలనకు నూటికి, నూటా యాబై మార్కులు వేస్తానని ఎద్దెవా చేశారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పొరపాట్లు జరగడం సహజం అని పేర్కోన్నారు. అయినా సీఎం జగన్ మా అబ్బాయో అంటూ చమత్కరించారు. కాగా ప్రస్తుతం ఆయన స్వంత అనంతరంపురంలోనే బస్సులను సీజ్ చేయడంతో ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
Former MP and TDP leader JC Diwakar Reddy Travel buses have once again been sieged. Five buses were seized in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X